Antibiotics without prescription: ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నారా? చాలా డేంజర్..
ABN , Publish Date - Jan 03 , 2026 | 07:31 PM
చాలా మంది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ తీసుకుంటారు? అయితే, ఇలా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: దగ్గు, జలుబు, జ్వరం లేదా శరీర నొప్పులు వచ్చినప్పుడు చాలామంది డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా నేరుగా మెడికల్ షాప్‌లో మందులు కొనేస్తుంటారు. ముఖ్యంగా యాంటీబయాటిక్స్‌ను ఇష్టమొచ్చినట్లు వాడుతున్నారు. కానీ ఇలా చేయడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ ఎందుకు తీసుకోకూడదు? తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
యాంటీబయాటిక్ వాడకం వల్ల ఏమవుతుంది?
ఆరోగ్య నిపుణుల ప్రకారం, భారత్‌లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ (AMR) వేగంగా పెరుగుతోంది. అంటే, బ్యాక్టీరియా ఈ మందులకు అలవాటు పడిపోతుంది. అప్పుడు నిజంగా అవసరమైన సమయంలో కూడా ఆ మందులు పని చేయవు. యాంటీబయాటిక్స్ అనేవి బాక్టీరియా ఇన్ఫెక్షన్లకు మాత్రమే ఉపయోగపడతాయి. కానీ, చాలామంది వైరల్ జలుబు, ఫ్లూ, గొంతు నొప్పి వంటి సమస్యలకు కూడా వీటిని తీసుకుంటున్నారు. అయితే, ఇలా చేయడం చాలా తప్పు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డాక్టర్ సలహా మేరకు మాత్రం యాంటీబయాటిక్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఏం చేయాలి?
డాక్టర్ సలహా లేకుండా యాంటీబయాటిక్స్ తీసుకోకండి.
మిగిలిపోయిన మందులను మళ్లీ వాడకండి.
ఇతరుల మందులు తీసుకోవద్దు.
యాంటీబయాటిక్స్‌ను డాక్టర్ సూచన మేరకు జాగ్రత్తగా వాడితేనే మన ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది.
ఇవాళ నిర్లక్ష్యం చేస్తే, రేపు చిన్న వ్యాధికే పెద్ద ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉంది.
(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధృవీకరించలేదు )
Also Read:
చలికాలం.. ఎక్కువగా ఆకలి వేయడానికి కారణం ఇదే
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే.!
For More Latest News