Home » Congress
డీఎంకే కూటమి నుంచి హస్తం గుర్తు (కాంగ్రెస్) జారిపోదని ఉపముఖ్యమంత్రి ఉదయనిధి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. దిండుగల్ సమీపంలోని వేడచెందూర్‌లో శుక్రవారం ఉదయం జరిగిన డీఎంకే ప్రముఖుడు స్వామినాధన్ ఇంటి వివాహ వేడుకల్లో ఉదయనిధి పాల్గొని వధూవరులకు పుష్పగుచ్ఛం సమర్పించి శుభాకాంక్షలు తెలిపారు.
ప్లాన్ ‘బీ’ని సిద్ధం చేసుకుని ఇవాళ హైకోర్టులో తూతూమంత్రంగా వాదనలు వినిపించిందని కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను రాజకీయంగా వాడుకుంటోందని మండిపడ్డారు.
నవంబర్ 11వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ఈ నెల 13 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు.
అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా, బీసీ వర్గానికి చెందిన నాయకుడిగా, తనకు ఎవరిపైనా అలాంటి అభిప్రాయం ఉండదన్నారు. రాజకీయ దురుద్దేశంతో కొంతమంది తన వ్యాఖ్యలను వక్రీకరించి, వాస్తవానికి భిన్నంగా ప్రచారం చేశారని మండిపడ్డారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌కి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పార్టీ శ్రేణులతో ఈ రోజు(మంగళవారం) జూమ్ మీటింగ్ నిర్వహించారు.
కాంగ్రెస్ 78 సీట్లు అడుగుతుండగా, 48 సీట్లు ఇచ్చేందుకు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సుముఖంగా ఉన్నారు. దీంతో మధ్యేమార్గంగా కాంగ్రెస్‌కు 55 సీట్లు వరకూ కేటాయించవచ్చని అంచనా వేస్తున్నారు.
కాంగ్రెస్ కుట్రలను తిప్పి కొడతామని స్పష్టం చేశారు. ప్రజలకు ఉన్న బాకీ కార్డుతో గుర్తు చేస్తే... ధోకా కార్డును తెరపైకి తెస్తున్నారని వినయ్ భాస్కర్ మండిపడ్డారు. అమలు కానీ హామీలతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపణలు గుప్పించారు.
బీఆర్ఎస్ గతంలో హామీలు ఇచ్చి అమలు చేయని పనులతో ఢోఖా కార్డును కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీ కడియం కావ్య, నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ... కేటీఆర్‌కు సవాల్ విసిరారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. అనంతరం నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేయనున్నట్లు ప్రకటించింది.
8వ తేదీన హైకోర్టులో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నామన్నారు. బీసీలకు రాజకీయంగా 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం అన్ని వర్గాలు సహకరించాలని మహేష్ గౌడ్ కోరారు.