Share News

అక్రమ కేసులు కొట్టేయాలి

ABN , Publish Date - Dec 19 , 2025 | 12:43 AM

కాంగ్రెస్‌ పార్టీ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీపై అక్రమంగా కేసులు పెట్టారని, వీటిని కొట్టివేయాలని ఆ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ కో కన్వీనర్‌ కాశీంవలి, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు వీరేష్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

అక్రమ కేసులు కొట్టేయాలి
ధర్నా చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు

ఎమ్మిగనూరు రూరల్‌, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీపై అక్రమంగా కేసులు పెట్టారని, వీటిని కొట్టివేయాలని ఆ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ కో కన్వీనర్‌ కాశీంవలి, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు వీరేష్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. పట్టణంలోని పోస్టాఫీసు కార్యాలయం ముందు గురువారం ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను ధర్మాసనం తిరస్కరించిందన్నారు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో షబీర్‌, హాసీఫ్‌, హజరత్‌వలి, బనవాసి జైపాల్‌, అజయ్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 19 , 2025 | 12:43 AM