Home » Congress Govt
ప్రజలకు ఎక్కడా ప్రైవేటు ఆస్తుల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని, అదే సమయంలో ప్రభుత్వ ఆస్తుల సంరక్షణలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా అధికారులు పని చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. 22ఏపై ప్రతిపక్షాల రాద్ధాంతం ప్రజల కోసం కాదని.. కొందరు నాయకులు, పార్టీలు తాము ఆక్రమించిన ప్రభుత్వ భూములను 22ఏ జాబితా నుంచి తొలగించుకుని, కైవసం చేసుకునే కుట్ర కూడా ఉండవచ్చని సీఎం పేర్కొన్నట్టు తెలిసింది
తెలంగాణలో విద్యాభివృద్ధికి ఒప్పందాల కోసమే అమెరికా పర్యటన పెట్టుకున్న సీఎం రేవంత్
రైతులు మోతాదుకు మించి ఎరువులు వాడుతున్నారని, నేల ఆరోగ్యం దెబ్బతింటున్నదని, ఎరువుల ధరల వ్యత్యాసం వల్లే రైతులు యూరియా వైపు మొగ్గుచూపుతున్నారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొన్నేళ్లుగా యూరియా వినియోగం అసాధారణ స్థాయిలో పెరుగుతున్నదని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన పీఎంఏవై నిధుల విడుదలలో నేటికీ స్పష్టత లేకపోవడంతో... ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం తానే బిల్లుల చెల్లింపులకు సమాయత్తమైంది.
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పర్యటిస్తూ విద్యార్థులను రెచ్చగొడుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి దమ్ముంటే తెలంగాణకు రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు సవాల్ విసిరారు.
వికసిత్ భారత్ 2047లో భాగంగా తెలంగాణ రైజింగ్ 2047ను ప్రకటించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ట్రిలియన్ డాలర్ల ఎకానమీ తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదికను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు ఈ కమిటీ ఇవ్వనుంది.
తెలంగాణలో సెక్షన్ 22A దుర్వినియోగం అవుతోందంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈరోజు(మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్ర పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని వ్యాఖ్యానించారు.
మాజీ మంత్రి హరీశ్‌రావుపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. హరీశ్‌రావు కాదు ఆయన అబద్దాల రావు అని ఎద్దేవా చేశారు.