Home » Congress Govt
ST జాబితాపై సొంత పార్టీ నాయకులతోనే సీఎం రేవంత్ రెడ్డి కోర్టులో కేసు వేయించారని దయాకర్ రావు విమర్శించారు. లంబాడీ బిడ్డల హక్కులను రేవంత్ రెడ్డి చెడగొట్టేందుకు పెద్ద కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
దేవాలయ ప్రాంగణ నూతన డిజైన్లో చేయాల్సిన మార్పులపై కొండా సురేఖ అధికారులకు పలు సూచనలు చేశారు. మేడారం నిర్వహణ పనులను సకాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు.
కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తే.. తలదించుకోవాల్సింది సీఎం రేవంతే అని జగదీష్ రెడ్డి విమర్శించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్సే అని ఉద్ఘాటించారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
పాలమూరు విశ్వవిద్యాలయం కేవలం ఒక PG కాలేజీలా మాత్రమే ఉండిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్రాన్ని నడిపించే అవకాశం వచ్చిందని తెలిపారు. ఇపుడు విద్యా, ఉపాధి, అవకాశాలను జిల్లా అంది పుచ్చుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సమకాలీన రాజకీయాల్లో కొందరు అధికారం ఉన్నపుడు మిత్రులుగా వస్తారు.. అధికారం పోయాక మాయం అవుతారని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. కానీ కేవీపీ రామచంద్ర రావు అలా కాదని, చివరి వరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తోడుగా నిలబడిన ఒకే ఒక్క మనిషి కేవీపీ అని పేర్కొన్నారు.
పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పుడు సీబీఐకి ఆ ఆధారాలు ఇచ్చి విచారణకు సహకరించాలని ఎంపీ లక్ష్మణ్ సూచించారు. కాగ్ కూడా అవినీతి జరిగింది, లోపాలు ఉన్నాయాని చెప్పిందని స్పష్టం చేశారు.
తనపై విమర్శలు చేస్తే ఎన్నికల పోటీ నుంచి వెనక్కు తగ్గను అని ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. తాను వెనక్కు తగ్గి సైలెంట్ అయిపోతానని కొంతమంది అనుకున్నారని పేర్కొన్నారు. తనను విమర్శించే వారు తాను ఇచ్చిన తీర్పు చదవాలని సూచించారు.
కాళేశ్వరంపై బీజేపీ వైఖరే నిజమని మరోసారి రుజువైందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఉద్ఘాటించారు. కాళేశ్వరం అవినీతికి బీఆర్ఎస్ పూర్తి బాధ్యత వహించాలని బండి సంజయ్ కోరారు.
కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను లక్ష కోట్లకు పెంచారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అసెంబ్లీలో పెట్టొద్దని, చర్చ చేయొద్దని హైకోర్టుకు వెళ్లి చేయాల్సింది అంతా మీరే చేశారని మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఆదివారం తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా మాజీ మంత్రి హరీష్‌రావుకు మైక్ ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు.