Telangana BC Reservation: బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్...
ABN , Publish Date - Oct 04 , 2025 | 06:13 PM
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన రిజర్వేషన్లను ఎత్తివేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలిపింది. అయితే..
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలోని బీసీ రిజర్వేషన్ల అంశం రోజుకో మలుపు తీసుకుంటుంది. ఇప్పుడు తాజాగా రిజర్వేషన్ల అంశం సుప్రీకోర్టుకు చేరింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయబోతున్నారని సుప్రీంకోర్టులో వంగ గోపాల్ రెడ్డి పిటిషన్ వేశారు.
50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారంటూ పిటిషన్‌లో చెప్పుకొచ్చారు. గతంలో సుప్రీంకోర్టు 50 శాతం రిజర్వేషన్ మించరాదంటూ ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా.. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉన్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో గోపాల్ రెడ్డి వేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. జస్టిస్ విక్రమ్ నాథ్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగనున్నట్లు సమాచారం.
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గత ప్రభుత్వం తీసుకొచ్చిన రిజర్వేషన్లను ఎత్తివేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలిపింది. దీనికి అన్ని పార్టీల నేతలు అంగీకారం తెలిపారు. ఆ తర్వాత వీటిని గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్‌కు పంపారు. అయితే ఈ బిల్లుకు గవర్నర్ ఇంకా ఆమోదం తెలపలేదు.
రిజర్వేషన్ల బిల్లుపై ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. తమ వద్దనే పెండింగ్‌లోనే ఉన్నాయని ఇటీవల రాజ్ భవన్ వర్గాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీ బిల్లుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం తెలంగాణ సర్కార్ కు షాక్ అనే చెప్పవచ్చు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇస్తోందో.. అనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Ashok: ప్రతిపక్షనేత సంచలన కామెంట్స్.. సిద్దరామయ్య అవుట్‌గోయింగ్ సీఎం
PM-SETU Scheme: ఐటీఐలు ఆత్మనిర్భర్ భారత్ వర్క్‌షాప్‌లు: పీఎం మోదీ