MLA Danam Nagender: ఎమ్మెల్యే పదవికి రాజీనామా.. స్పందించిన దానం నాగేందర్
ABN , Publish Date - Oct 05 , 2025 | 08:27 PM
ఆదివారం ఉదయం నుంచి దానం నాగేందర్ తన పదవికి రాజీనామా చేస్తున్నారని నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. పార్టీ ఫిరాయింపుల అంశంపై స్పీకర్ విచారణ చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి దానం రాజీనామా చేయబోతున్నారని వార్తలు గుప్పుమన్నాయి.
హైదరాబాద్: ఎమ్మెల్యే పదవికి దానం నాగేందర్ రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా.. ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని దానం నాగేందర్ ఖండించారు. రాజీనామా ప్రచారం వాస్తవం కాదని స్పష్టం చేశారు. తానంటే గిట్టనివాళ్లు బురద చల్లుతున్నారని ఆరోపించారు. రాజీనామా అనే ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని ఆయన వెల్లడించారు.
ఇవాళ (ఆదివారం) ఉదయం నుంచి దానం నాగేందర్ తన పదవికి రాజీనామా చేస్తున్నారని నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. పార్టీ ఫిరాయింపుల అంశంపై అసెంబ్లీ స్పీకర్ విచారణ చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి దానం నాగేందర్ రాజీనామా చేయబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్పందించిన దానం నాగేందర్ ప్రచారాన్ని ఖండించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. ఎట్టకేలకు అమరావతిలోని సీఆర్డీఏ భవనానికి మోక్షం
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు