Minister Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో 100 శాతం బీసీకే సీటు..
ABN , Publish Date - Oct 06 , 2025 | 04:49 PM
42 శాతం రిజర్వేషన్లపై సుప్రీంలో ఇవాళ విచారణ జరిగింది. తెలంగాణ తరఫున సింఘ్వీ , దవే వాదనలు వినిపించారు. ఈ క్రమంలో తెలంగాణ మంత్రులు బట్టి విక్రమార్క , పొన్నం ప్రభాకర్, వాకాటి శ్రీహరి నిన్న(ఆదివారం) రాత్రే ఢిల్లీ చేరుకున్నారు.
ఢిల్లీ: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో 100 శాతం బీసీకే సీటు వస్తుందనే నమ్మకం తనకు ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే పర్యటన చేస్తున్నట్లు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ గెలిచారని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞతతో ఓటు వేస్తారన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందని పొన్నం ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ అభివృద్ధికి పదేళ్లుగా దూరమైందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు సానుభూతి పేరిట మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబాన్ని రోడ్డు మీద పడేసి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.
కాగా, తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయబోతున్నారని సుప్రీంకోర్టులో వంగ గోపాల్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టులో ఇవాళ (సోమవారం) విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు సింఘ్వీ, దవే వాదనలు వినిపించారు. విచారణ అనంతరం గోపాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. వాదనలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, వాకాటి శ్రీహరి నిన్న(ఆదివారం) రాత్రే ఢిల్లీ చేరుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఏమైందంటే..
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు