Share News

MP Raghunandan Rao: కాంగ్రెస్ నేతలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు..

ABN , Publish Date - Oct 06 , 2025 | 05:39 PM

జూబ్లీహిల్స్‌లో ఓటర్ కార్డులను పంచుతున్న నవీన్ యాదవ్ ఎమ్మెల్యే పోటీకి ఎలా అర్హులు అవుతాడని ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. 'నవీన్ యాదవ్‌కు ఓటర్ ఐడీ కార్డులు ఎవరిచ్చారు, GHMC కమిషనర్ ఇచ్చారా..? ఎన్నికల కమిషన్ ఇచ్చిందా..?' ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

MP Raghunandan Rao: కాంగ్రెస్ నేతలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు..
MP Raghunandan Rao

హైదరాబాద్: ఎన్నికల కమిషన్‌‌‌కు ఎంపీ రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. ఓటర్ కార్డులను కాంగ్రెస్ నేతలు పంపిణీ చేయడంపై ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రఘునందన్ మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ నేతలు ఓటర్ ఐడీ కార్డులు పంచిపెట్టే దుకాణం పెట్టుకున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ చేతుల్లోకి రావాల్సిన ఓటర్ కార్డులు.. కాంగ్రెస్ నేతల చేతుల్లోకి ఎలా వెళ్లాయని ఆయన సూటిగా ప్రశ్నించారు. బహిరంగంగా ఓటర్ కార్డులను పంచుతుంటే ఎన్నికల కమిషన్, GHMC కమిషనర్లు ఎందుకు మాట్లాడటం లేదని ఎంపీ రఘునందన్ నిలదీశారు.


జూబ్లీహిల్స్‌లో ఓటర్ కార్డులను పంచుతున్న నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా పోటీకి ఎలా అర్హుడు అవుతాడని రఘునందన్ మండిపడ్డారు. 'నవీన్ యాదవ్‌కు ఓటర్ ఐడీ కార్డులు ఎవరిచ్చారు, GHMC కమిషనర్ ఇచ్చారా..? ఎన్నికల కమిషన్ ఇచ్చిందా..?' అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. SIR(Special Intensive Revision) చేస్తామంటే గగ్గోలు పెడుతున్న మేధావులు ఇలాంటి వాటి మీదా స్పందించాలని తెలిపారు. SIR చేస్తామంటే ఓట్ల చోరీ అంటున్నారని, ఇది ఐడీ కార్డుల చోరీనా..? అని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో ఓటర్ ఐడీ కార్డులపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లో ఓటర్ ఐడీ కార్డుల పంపిణీపై వెంటనే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఏమైందంటే..

వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు

Updated Date - Oct 06 , 2025 | 06:05 PM