Home » Congress Govt
మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా రూ.255 కోట్ల ట్రిప్స్ పూర్తి అయ్యాయని పేర్కొన్నారు.
సింగరేణి కార్మికుల సమస్యలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వానికి పట్టవా అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని భరోసా కల్పించారు.
గురుకులాల్లో ఫుడ్ ఫాయిజన్ ఘటన దురదృష్టకరమని తెలంగాణ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం విచారణకు అదేశించిందని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
ఐడీపీఎల్ భూముల ఆక్రమణలపై ఇటీవల ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఓ కథనంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సదరు భూములపై విజిలెన్స్ అధికారుల విచారణకు ఆదేశించింది కాంగ్రెస్ సర్కార్.
ఒక నెలలోపు పెండింగులో ఉన్న పదవులు అన్నీ భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్ఫష్టం చేశారు. ఆదిలాబాద్లో కాంగ్రెస్ పటిష్ఠంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రజల నుంచి తమ ప్రభుత్వానికి అపూర్వ ఆదరణ వస్తోందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా సర్పంచ్లను కాంగ్రెస్ గెలిచిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో సహా కొందరికీ కేబినెట్ హోదా కల్పిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం ఓ జీవో ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేత ఏరోళ్ల శ్రీనివాస్ తెలంగాణ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఓయూను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతానని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులకు తమ ప్రభుత్వం అండగా ఉండాలనే ఓ ఆలోచనతో ఇక్కడకు వచ్చానని వ్యాఖ్యానించారు.
హిందూ దేవుళ్లపై రేవంత్రెడ్డికి ఎందుకంత కోపమని బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నిలదీశారు. కాంగ్రెస్ అంటే ముస్లింలని రేవంత్రెడ్డి అన్నారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్లను ఎందుకు జైల్లో వేయడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఆరోపణలు చేశారు. భూములు అమ్మి ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్ హయాంలో పేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలనే ఆలోచనే చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. పేదలందరికీ తమ ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇచ్చామని స్పష్టం చేశారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు.