Home » CM Revanth Reddy
‘‘ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో గెలవలేనప్పుడే కుయుక్తులు పన్నుతారు. ఇదివరకు ఈడీ, సీబీఐ వంటి సంస్థల ద్వారా ఇతర పార్టీల సానుభూతిపరులను బెదిరించి, అక్రమ కేసులు పెట్టి ఎన్నికల్లో బీజేపీ గెలిచేది. ఇప్పుడు మోదీ కొత్త విధానాన్ని కనిపెట్డారు. అదే ఎస్‌ఐఆర్ ప్రక్రియ పేరుతో ఓట్లను తొలగించడం’’అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 7: తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం, నిరసనకారులపై పోలీసులు కిరాతకంగా వ్యవహరించారని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్ టీ షర్ట్ నిరసనల అనంతరం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలపై అసెంబ్లీలో దుమారం చెలరేగింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ.. చీకటి మిత్రులను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
‘సర్’ పేరుతో వ్యతిరేక ఓట్లను తీసేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కోటి ఓట్లను తీసేసే కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు.
అసెంబ్లీ దగ్గర బీఆర్ఎస్ నేతలు వ్యవహరించిన తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తన ఛాంబర్‌లో కాంగ్రెస్ పార్టీ నేతలతో ఈ విషయంపై సీఎం చర్చించారు.
కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. సబండ వర్గాలను మోసం చేసిందని విమర్శించారు.
అసెంబ్లీ సమావేశాలపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలను 15రోజుల పాటు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
త్వరలో తెలంగాణ ఆర్టీసీ - హైదరాబాద్ మెట్రో రైల్ ఉమ్మడి పాస్ ఏర్పాటు చేయడానికి రాష్ట్రం ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఈ క్రమంలోనే మెట్రో - ఆర్టీసీ ఉమ్మడి పాస్ జారీ చేయాలని అధికారులను ప్రభుత్వ సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీని ఎక్కువ రోజులు నడపడానికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భయపడుతుందని విమర్శించారు.
సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర ప్రజల భూములను 22 ఏలో పెట్టలేదని తెలిపారు.