Kaleshwaram Commission report : కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి, రేపు సభలో చర్చ
ABN , Publish Date - Aug 30 , 2025 | 04:17 PM
కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై రేపు తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరుగనుంది. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉ.9 గంటలకు శాసనసభలో రిపోర్ట్ ప్రవేశపెట్టబోతున్నారు. అనంతరం ఉ.9:30 గంటలకు కేరళ వెళ్లి, సా.3:40 కి తిరిగి అసెంబ్లీకి సీఎం రేవంత్ చేరుకుంటారు.
కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై రేపు తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరుగనుంది. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉ.9 గంటలకు శాసనసభలో రిపోర్ట్ ప్రవేశపెట్టబోతున్నారు. అనంతరం ఉ.9:30 గంటలకు కేరళ వెళ్లి, సా.3:40 కి తిరిగి అసెంబ్లీకి సీఎం రేవంత్ చేరుకుంటారు.

ఇలా ఉండగా, రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బీఏసీ సమావేశం నిర్వహించారు. స్పీకర్ కార్యాలయంలో మొదలైన బీఏసీ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ హజరుకాగా, బీఆర్ఎస్ నుండి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. బీజేపీ నుండి ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీఏసీ సమావేశానికి హాజరయ్యారు.
అయితే, బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ మధ్యలోనే వాకౌట్ చేసింది. ఎరువుల కొరత , వరదలపై చర్చించాలని బీఆర్ఎస్ పార్టీ పట్టుబట్టింది. అయితే, ప్రభుత్వం దీనికి అంగీకరించలేదు. దీనికి నిరసనగా బీఏసీ నుంచి బిఆర్ఎస్ వాకౌట్ చేసింది.
ఇలా ఉండగా, ఇవాళ అసెంబ్లీ ఆవరణలో మంత్రి సీతక్క మీడియాతో చిట్ చాట్ జరిపారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై చర్చ అంటే బిఆర్ఎస్ కు భయం ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. కోర్ట్ లో ఏం తేలకపోవడంతో యూరియా అంశాన్ని బిఆర్ఎస్ తెరపైకి తెచ్చిందని ఆమె విమర్శించారు. కాళేశ్వరం పై చర్చ జరగకుండా ఉండేందుకు యూరియా పేరు తో బిఆర్ఎస్ రాజకీయం చేస్తుందని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. కాళేశ్వరం రిపోర్ట్ అసెంబ్లీ పెట్టకుండా ఉండేందుకు బిఆర్ఎస్ శతవిధాల ప్రయత్నం చేస్తోందని మంత్రి అన్నారు.
ఇవి కూడా చదవండి:
అంజీర్ కొనేప్పుడు జాగ్రత్త! అసలైనదా? నకిలీదా? ఇలా తెల్సుకోండి!
కల్తీ పాలను ఎలా గుర్తించాలో తెలుసా?