Real vs Fake Anjeer: అంజీర్ కొనేప్పుడు జాగ్రత్త! అసలైనదా? నకిలీదా? ఇలా తెల్సుకోండి!
ABN , Publish Date - Aug 30 , 2025 | 10:42 AM
డ్రై ఫ్రూట్స్‌లో రారాజుగా పిలిచే అంజీర్ పండ్లు రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. కానీ ఇటీవలి కాలంలో నకిలీ, కల్తీ అంజీర్ పండ్లు మార్కెట్లో పెద్ద మొత్తంలో అమ్ముడవుతున్నాయి. కాబట్టి, ఈ చిట్కాలతో అసలైన, నకిలీ వాటికి మధ్య తేడాను గుర్తించండిలా..
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ, కొనేటప్పుడు నిజమైన, నకిలీ వాటి మధ్య తేడాను గుర్తించకపోతే చాలా ప్రమాదం. ఉదాహరణకు ఎండినబెట్టిన అంజీర్ పండ్లతో లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అందుకే ధర ఎక్కువైనప్పటికీ ప్రజలు కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. కానీ ఈ రోజుల్లో మార్కెట్లలో నకిలీ అంజీర్ పండ్లు ఎక్కడపడితే అక్కడ అమ్ముడవుతున్నాయి. కాబట్టి, అంజీర్ పండ్లను కొనుగోలు చేసేటప్పుడు ఈ కింది విషయాలను దృష్టిలో ఉంచుకోండి. ఈ సింపుల్ చిట్కాలతో నిజమైన, నకిలీ అంజీర్ పండ్ల మధ్య తేడాను గుర్తించండి.
ఆరోగ్యంగా ఉండటానికి తరచుగా డ్రై ఫ్రూట్స్ తినాలని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. ఇవి మన శరీరంలోని అన్ని ముఖ్యమైన పోషకాల లోపాన్ని తీర్చడంలో ప్రభావవంతంగా భావిస్తాయి. జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదం నుంచి అంజూరపు పండ్ల వరకూ మార్కెట్లో అనేక రకాల డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయి. ఖరీదు ఎక్కువైనా ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు దక్కుతాయనే కారణంతో ప్రజలు ఆలోచించకుండా డ్రై ఫ్రూట్స్‌ను కొనుగోలు చేస్తారు. కానీ, ఇది చాలా తప్పు. చాలాసార్లు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి మీకు తెలియకుండానే నకిలీ వాటిని కొనుగోలు చేసే ప్రమాదముంది. అదెలా కనిపెట్టాలో తెలుసుకోండి.
నిజమైన, నకిలీ అంజీర్ మధ్య తేడా ఎలా గుర్తించాలి
1.రంగు
అంజీర పండ్లను కొనడానికి వెళ్ళినప్పుడు మొదట వాటి రంగును తనిఖీ చేయండి. అంజీర పండ్లు చాలా పసుపు, బంగారు లేదా మెరుస్తూ కనిపిస్తే వాటిపై రసాయనాల పూత పూశారని అర్థం చేసుకోండి. ఎందుకంటే అసలైన అంజీర పండ్లు లేత గోధుమ లేదా ముదురు గోధుమ రంగులో ఉంటాయి. ఎక్కువ మెరుస్తూ కనిపించవు. ఇలాంటి వాటిని వాటిని సంకోచం లేకుండా కొనుగోలు చేయవచ్చు.
2.వాసన తనిఖీ చేయండి
నిజమైన అంజీర పండ్లు తేలికపాటి తీపి వంటి సహజ సువాసనను కలిగి ఉంటాయి. మరోవైపు, నకిలీ అంజీర పండ్ల నుంచి వింత వాసన రావచ్చు.
3.ఆకారాన్ని చెక్ చేయండి
నిజమైన, నకిలీ అంజీరను గుర్తించడానికి ఉత్తమ మార్గం దానిని మధ్యలో పగలగొట్టి తనిఖీ చేయడం. అంజీర పండు లోపల ఎరుపు లేదా మెరూన్ రంగులో ఉండి దానిలో చిన్న విత్తనాలు కనిపిస్తే అంది నిజమైన అంజీర పండు. అలాకాక, అంజీర పండు లోపల తెలుపు లేదా పసుపు రంగు ఉంటే కెమికల్స్ ఉపయోగించినట్టే.
4.చేత్తో తాకండి
అంజీర పండును చేతిలోకి తీసుకొని తేలికగా నొక్కండి. నిజమైన అంజీర్ అయితే కొద్దిగా మృదువుగా, తాకడానికి జిగటగా ఉంటుంది. నకిలీ అంజీర్ అయితే చాలా గట్టిగా, పొడిగా ఉంటుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
ఇవి కూడా చదవండి:
ఉసిరితోనూ సైడ్ ఎఫెక్ట్స్.. వీటిని ఎవరు తినకూడదంటే..
బీపీ ఔషధాలు పని చేయట్లేదా.. కారణాలు ఇవే..