BRS: బావమరిది కంపెనీలకు అక్రమంగా కాంట్రాక్టులు
ABN , Publish Date - Aug 30 , 2025 | 01:21 AM
సీఎం రేవంత్ రెడ్డి బావ మరిదికి చెందిన ‘శోధ కన్‌స్ట్రక్షన్’, ‘కేఎల్‌ఎ్‌సఆర్ ఇన్‌ఫ్రాటెక్ కంపెనీ’లకు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు ఇస్తోందని బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ ఆరోపించారు.
రేవంత్‌పై ఈడీకి బీఆర్‌ఎస్ ఫిర్యాదు
న్యూఢిల్లీ, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్ రెడ్డి బావ మరిదికి చెందిన ‘శోధ కన్‌స్ట్రక్షన్’, ‘కేఎల్‌ఎ్‌సఆర్ ఇన్‌ఫ్రాటెక్ కంపెనీ’లకు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు ఇస్తోందని బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ ఆరోపించారు. ఆ కంపెనీలకు, ముఖ్యమంత్రికి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయన్నారు. ఈ మేరకు కంపెనీలతో పాటు రేవంత్‌పై విచారణ జరింపించాలని శుక్రవారం ఢిల్లీలో ఈడీ అధికారులను కలిసి క్రిశాంక్ విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన మీడియాకు ఆ వివరాలు వెల్లడించారు. ‘‘2022లో కేవలం రూ.7,13,113 ఆర్థిక లావాదేవీలున్న శోధ కన్‌స్ట్రక్షన్స్‌కు అమృత్ టెండర్లు, సింగరేణి మైనింగ్ కాంట్రాక్టు, డిండి ఇరిగేషన్ కాంట్రాక్టు ఇవ్వడంపై విచారణ చేపట్టాలి. ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రాటెక్ కంపెనీకి చెందినదే.
ఆయన అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే శోధ కంపెనీకి రూ.1,137కోట్లఅమృత్ కాంట్రాక్టు, రూ.115కోట్ల సింగరేణి మైనింగ్ కాంట్రాక్టు, రూ.365కోట్ల డిండి కాంట్రాక్టులను నిబంధనలకు విరుద్ధంగా అప్పగించారు. అలాగే, కేఎల్‌ఎ్‌సఆర్ ఇన్‌ఫ్రాటెక్ కంపెనీకి ప్రభుత్వం అనేక లాభాలు చేకూర్చింది. రూ.168 కోట్ల మిషన్ భగీరథ కాంట్రాక్టు, రూ.191 కోట్ల పాలేరు రిజర్వాయర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, రూ.319 కోట్ల రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కాంట్రాక్టులను అప్పగించారు’ అని క్రిశాంక్ ఆరోపించారు.