Home » CM Revanth Reddy
దేవాలయ ప్రాంగణ నూతన డిజైన్లో చేయాల్సిన మార్పులపై కొండా సురేఖ అధికారులకు పలు సూచనలు చేశారు. మేడారం నిర్వహణ పనులను సకాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు.
కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తే.. తలదించుకోవాల్సింది సీఎం రేవంతే అని జగదీష్ రెడ్డి విమర్శించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్సే అని ఉద్ఘాటించారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
పాలమూరు విశ్వవిద్యాలయం కేవలం ఒక PG కాలేజీలా మాత్రమే ఉండిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్రాన్ని నడిపించే అవకాశం వచ్చిందని తెలిపారు. ఇపుడు విద్యా, ఉపాధి, అవకాశాలను జిల్లా అంది పుచ్చుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డిహయాంలో చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించి తీరుతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు...
సమకాలీన రాజకీయాల్లో కొందరు అధికారం ఉన్నపుడు మిత్రులుగా వస్తారు.. అధికారం పోయాక మాయం అవుతారని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. కానీ కేవీపీ రామచంద్ర రావు అలా కాదని, చివరి వరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తోడుగా నిలబడిన ఒకే ఒక్క మనిషి కేవీపీ అని పేర్కొన్నారు.
టీవల భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై రెండ్రోజుల్లో నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మృతుల కుటుంబాలకు వెంటనే రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని ఆదేశించారు...
నక్సలిజం అనేది ఒక భావజాల(ఫిలాసఫీ)మని, అది నచ్చనప్పుడు వాదించి గెలవాలే తప్ప దాడి చేసి, అంతం చేస్తానంటే కుదరదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇండియా కూటమి తరఫున బరిలో ఉన్న ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి నక్సలైట్ అంటూ...
కొందరు తటస్థులు కూడా ఫోన్ చేసి తనకు మద్దతు పలికారని సుదర్శన్ రెడ్డి తెలిపారు. దేశంలో ఉండే మెజారిటీ ప్రజల అభ్యర్థినని గొప్పగా ఫీల్ అవుతున్న అని హర్షం వ్యక్తం చేశారు. పది రోజుల్లో తాను కూడా రాజకీయాల్లో ముదిరి పోయా అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కాళేశ్వరం కమిషన్ నోటీసుపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఇందులో ఆ ఇద్దరిదే కీలకపాత్ర.. కేసీఆర్ బలిపశువును చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనపై విమర్శలు చేస్తే ఎన్నికల పోటీ నుంచి వెనక్కు తగ్గను అని ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. తాను వెనక్కు తగ్గి సైలెంట్ అయిపోతానని కొంతమంది అనుకున్నారని పేర్కొన్నారు. తనను విమర్శించే వారు తాను ఇచ్చిన తీర్పు చదవాలని సూచించారు.