Share News

CM Revanth Promises: ప్రాణహిత కట్టి తీరుతాం

ABN , Publish Date - Sep 03 , 2025 | 03:49 AM

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిహయాంలో చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించి తీరుతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు...

CM Revanth Promises: ప్రాణహిత కట్టి తీరుతాం

వైఎస్‌ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేస్తాం

  • తుమ్మిడిహట్టి బ్యారేజీ, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను నిర్మిస్తాం

  • రైతాంగానికి సాగు నీరు.. ప్రజలకు తాగు నీరు అందిస్తాం

  • వైఎస్‌ స్ఫూర్తితోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం

  • సమకాలీన రాజకీయాల్లో.. అధికారం ఉన్నప్పుడే మిత్రులు

  • అధికారం పోయాక మాయమవుతారు.. కేవీపీ అలా కాదు

  • వైఎ్‌సకు పదవులు లేని సమయంలోనూ తోడుగా ఉన్నారు

  • కేవీపీలా ఉంటామంటూ నా దగ్గరకూ కొందరు వస్తున్నారు

  • మొదటివారం రమ్మంటే.. రెండోవారం ‘అంతా నాదే’ అంటున్నారు.. వైఎస్‌ స్మారక పురస్కార సభలో సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిహయాంలో చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించి తీరుతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రూ.11వేల కోట్లకు పైగా ఖర్చుతో చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహటి ్టబ్యారేజీని పూర్తి చేసి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, తాండూరు, వికారాబాద్‌, కొడంగల్‌కు గోదావరి నీటిని అందిస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే.. సుమారు 3.6 లక్ష్లల ఎకరాలకు సాగునీరు, ఫ్లోరైడ్‌ పీడిత నల్లగొండ జిల్లాలో ప్రజలకు తాగునీటిని అందించేందుకు ప్రతిపాదించిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనులను పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం దసపల్లా హోటల్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రేవంత్‌.. సుభాష్‌ పాలేకర్‌, డాక్టర్‌ సి.సుధ, డాక్టర్‌ సి.నాగేశ్వరరావుకు డాక్టర్‌ వైఎ్‌స.రాజశేఖర రెడ్డి మెమోరియల్‌ అవార్డు- 2025ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. సీఎంగా వైఎస్‌ తొలి సంతకం వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఫైల్‌ పైనే చేశారని గుర్తుచేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ వంటి పథకాలకు రూపకల్పన చేశారన్నారు. వైఎస్‌ ఆలోచలనకు అనుగుణంగా పని చేస్తున్న తమ ప్రభుత్వం సంక్షేమాన్ని, అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. రాజశేఖర్‌రెడ్డి 2009లో రెండోసారి సీఎంగా ఎన్నికైన వెంటనే గాంధీభవన్‌కు వెళ్లి.. రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారన్డి గుర్తు చేశారు. అందరి సహకారంతో రాహుల్‌ను ప్రధానిగా చేసే లక్ష్యంతో తాము పని చేస్తున్నట్టు తెలిపారు. సుభాష్‌ పాలేకర్‌ సూచించినట్టుగా.. ఎరువుల కొరతకు ఆస్కారం లేకుండా సేంద్రియ వ్యవసాయ విధానంపై ప్రణాళికలు రూపొందించనున్నట్టు తెలిపారు. రసాయన ఎరువుల వినియోగంతో ఒక్కో గ్రామం సుమారు రూ.4.24 కోట్ల మేరకు వైద్యం, తదితర అవసరాలకు వ్యయం చేయాల్సి వస్తోందనే అంశాన్ని ఉటంకిస్తూ.. రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయంపై దృష్టి కేంద్రీకరిస్తామన్నారు.


అధికారం ఉంటేనే మిత్రులు..

సమకాలీన రాజకీయాల్లో అధికారం ఉన్నపుడు అనేక మంది మిత్రులుగా వస్తారని, అధికారం పోయాక మాయం అవుతారని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ.. చదువుకునే రోజుల నుండి మరణం వరకూ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి డాక్టర్‌ కేవీపీ రామచంద్ర రావు తోడు నీడగా నిలబడ్డారని ఆయన గుర్తుచేశారు. ‘‘కేవీపీలాగా ఉంటామంటూ కొంతమంది నా దగ్గరకు వస్తున్నారు.. వారిని మొదటి వారం లోపలికి రానిస్తే, రెండో వారం నా కుర్చీలో కూర్చుని ‘నేనే అంతా నడుపుతాలే’ అంటున్నారు’’ అని చెప్పి నవ్వులు పూయించారు. కేవీపీలా ఉంటామంటూ తనవద్దకు వచ్చినవారికి.. ‘‘మీరెప్పటికీ ఆయనలా కాలేరు.. అలాంటి ఆలోచన సైతం చేయవద్దు’’ అని సూచించినట్టు రేవంత్‌ తెలిపారు. 1978లో ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వైఎస్‌.. ఆ తర్వాత ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నికైనప్పటికీ ఆయనకు పదవులు దక్కలేదని, అనేక సమస్యలను ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. ఆ సమయంలో ఆయన వెన్నంటి ఉన్న కేవీపీ.. వైఎస్‌ తప్పులను తన ఖాతాలో వేసుకుని, మంచిని వైఎస్‌ ఖాతాలో వేసి ఆయనకు ఆత్మలా పనిచేశారన్నారు. సర్వం త్యాగం చేయగల గుణం, సమస్యలను ఎదుర్కొనే శక్తి కేవీపీకి ఉందన్నారు. సభలో ప్రత్యేక అతిధిగా పాల్గొన్న హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్‌ హుడా వైఎ్‌సను ప్రశంసించారు. రైతుల సమస్యలను పాదయాత్ర సమయంలో తెలుసుకున్న వైఎస్‌.. అధికారంలోకి రాగానే వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారని కొనియాడారు. ఇక.. వైఎ్‌సతో కలిసి పనిచేయడం తనకు గర్వకారణమని డిప్యూటి సీఎం మల్లుభట్టి విక్రమార్క అన్నారు. వ్యవసాయానికి ఏడుగంటల ఉచిత విద్యుత్‌ సాధ్యం కాదని అప్పట్లో అధికారులు అన్నప్పటికీ.. వైఎస్‌ ఆ పథకాన్ని అమలుచేసి రైతుబాంధవుడిగా నిలిచారని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. పాలనలో సంస్కరణల ద్వారా రాజశేఖర్‌రెడ్డి ప్రజల హృదయాలపై చెరగని ముద్ర వేశారని టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ కొనియాడారు. కాగా... ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి, డాక్టర్‌ కేవీపీ రామచంద్రరావు, ఎపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌. షర్మిల, ఎమెస్కో విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

దీన్ని ఫాలో చేయాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. ఏం రాశాడో మీరే చూడండి..

ఓరి దీని వేషాలో.. పామును ఈ పిల్లి ఎలా కెలుకుతుందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

Updated Date - Sep 03 , 2025 | 03:49 AM