Sudarshan Reddy: నేను ముదిరి పోయా.. సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Sep 01 , 2025 | 07:18 PM
కొందరు తటస్థులు కూడా ఫోన్ చేసి తనకు మద్దతు పలికారని సుదర్శన్ రెడ్డి తెలిపారు. దేశంలో ఉండే మెజారిటీ ప్రజల అభ్యర్థినని గొప్పగా ఫీల్ అవుతున్న అని హర్షం వ్యక్తం చేశారు. పది రోజుల్లో తాను కూడా రాజకీయాల్లో ముదిరి పోయా అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: ఇండియా కూటమి అభ్యర్థి నుంచి.. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిగా మారిపోయానని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి అన్నారు. తనపై విమర్శలు చేస్తే ఉప రాష్ట్రపతి ఎన్నికల పోటీ నుంచి వెనక్కు తగ్గానని తెలిపారు. తాను వెనక్కి తగ్గి సైలెంట్ అయిపోతానని కొంతమంది అనుకున్నారని పేర్కొన్నారు. తనను విమర్శించే వారు తాను ఇచ్చిన తీర్పు చదవాలని సూచించారు. ఈ మేరకు ఆయన ఇవాళ(సోమవారం) మీడియాతో మాట్లాడారు..
కొందరు తటస్థులు కూడా ఫోన్ చేసి తనకు మద్దతు పలికారని సుదర్శన్ రెడ్డి తెలిపారు. దేశంలో ఉండే మెజారిటీ ప్రజల అభ్యర్థినని గొప్పగా ఫీల్ అవుతున్న అని హర్షం వ్యక్తం చేశారు. పది రోజుల్లో తాను కూడా రాజకీయాల్లో ముదిరి పోయా అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకటి రాజకీయ సహవాసం.. రెండో మీడియాతో మాట్లాడటంతో ముదిరిపోయ అని స్పష్టం చేశారు. ఈ వయసులో ఎందుకీ ముళ్ళ కిరీటం అని ప్రశ్నలు వస్తున్నాయని పేర్కొన్నారు. కానీ ఉప రాష్ట్రపతి... రాజకీయ పదవి కాదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నేతుల మొదట తనను అడిగితే.. ఇబ్బందని చెప్పానని, ఇండియా కూటమి అభ్యర్థిగా అయితే.. ఆలోచిస్తా అని చెప్పినట్లు గుర్తు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఒకరోజు వచ్చి వెంటనే ఢిల్లీ వెళ్లాలని చెప్పారని సుదర్శన్ రెడ్డి వివరించారు. ఢిల్లీ వెళ్లే సరికి 20 మంది ఎంపీలు ఉన్నారని తెలిపారు. ఈ క్రమంలో భారత ఎన్నికల కమిషన్‌పై కూడా ఆయన విమర్శలు చేశారు. ఎన్నికల కవిషన్ విధులు నిర్వహించడంలో విఫలం అయ్యిందని ఆరోపించారు. ఎలక్షన్ ఇప్పుడు ఫ్రీ అయ్యింది.. కానీ ఫేర్ పోయిందని పేర్కొన్నారు. కులం, మతం లేని జాబితా కేవలం ఓటర్ల జాబితానే అని ఆయన ఉద్ఘాటించారు. తనకు మద్దుతు తెలిపిన అందరికి ఆయన కృతజ్ఞతలు చెబుతున్నట్లు చెప్పుకొచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. టీజీఎస్పీడీసీఎల్ కొత్త నిబంధనలు
తెలంగాణ శాసనమండలిలో బీసీ బిల్లుకు ఆమోదం