Home » CM Revanth Reddy
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ.. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డితో మహేష్ గౌడ్ భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు పలు కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
కవిత ఎందుకు అలాంటి కామెంట్లు చేశారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని మాజీ మంత్రి హరీష్‌రావు చెప్పుకొచ్చారు. తమ వ్యతిరేక పార్టీలు మామీద ఎలాంటి కామెంట్లు చేశాయో... కవిత కూడా అలాంటి కామెంట్లను తనమీద చేశారని విమర్శించారు. ఎరువుల కొరత వరద ప్రభావం ఇలాంటి సమస్యలతో రాష్ట్రం ఇబ్బంది పడుతోందని హరీష్‌రావు పేర్కొన్నారు.
గతంలో పట్టణాలు, పెద్ద పెద్ద యూనివర్సిటీల్లోనే ఉంటుందనుకునే గంజాయి, డ్రగ్స్ ఇప్పుడు గ్రామాల వరకూ చేరాయని, పిల్లలను జాగ్రత్తగా గమనిస్తూ కనిపెట్టాలని ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
ధరణి భూతాన్ని తెచ్చి భూములు కొల్లగొట్టాలని గతపాలకులు చూశారు. వాళ్ల దోపిడీకి మీరు అడ్డుగా ఉన్నారని భావించారు. అందుకే, మిమ్మల్ని దోషులుగా, దోపిడీ దారులుగా చిత్రీకరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రూ.లక్ష కోట్లు వృథా అయ్యాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది. తెలంగాణలో వైద్య పరికరాల తయారీ యూనిట్‌ను ప్రారంభించేందుకు జర్మనీ దేశానికి చెందిన బీఈబీఐజీ మెడికల్ కంపెనీ ఆసక్తి కనబరుస్తోంది.
బొజ్జగణపయ్య గంగమ్మ ఒడికి చేరే సమయం వచ్చేసింది. నగరంలో గల్లీ గల్లీన వెలిసి..
యూరియా సరఫరా పెరుగుతున్న నేపథ్యంలో రైతు వేదికల వద్ద అదనపు యూరియా సేల్ కౌంటర్లు ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. వచ్చే 20 రోజులు.. రోజుకు 10,000 మెట్రిక్ టన్నుల చొప్పున రాష్ట్రానికి సరఫరా చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్లు ఆయన చెప్పారు
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంశం మీద టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్నదమ్ములిద్దరూ ముక్కుసూటిగా మాట్లాడుతారన్నారు. మంత్రి పదవుల విషయంలో జిల్లాను యూనిట్‌గా చూడలేమని..