Medical Equipment: రాష్ట్రంలో మరో కంపెనీ పెట్టుబడులు
ABN , Publish Date - Sep 06 , 2025 | 04:00 AM
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది. తెలంగాణలో వైద్య పరికరాల తయారీ యూనిట్‌ను ప్రారంభించేందుకు జర్మనీ దేశానికి చెందిన బీఈబీఐజీ మెడికల్ కంపెనీ ఆసక్తి కనబరుస్తోంది.
సీఎం రేవంత్‌తో జర్మనీ కంపెనీ ప్రతినిధుల భేటీ
వైద్య పరికరాలతయారీ.. యూనిట్‌ను ప్రారంభించేందుకు ఆసక్తి
హైదరాబాద్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది. తెలంగాణలో వైద్య పరికరాల తయారీ యూనిట్‌ను ప్రారంభించేందుకు జర్మనీ దేశానికి చెందిన బీఈబీఐజీ మెడికల్ కంపెనీ ఆసక్తి కనబరుస్తోంది. ఈ అంశంపై చర్చించేందుకు ఆ కంపెనీ చైర్మన్, సీఈవో జార్జ్‌చాన్ ప్రతినిధి బృందం శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వైద్య పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటుకు సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
యూనిట్ ఏర్పాటుకు అనువైన స్థలం, ఇతర అంశాలకు సంబంధించి అధ్యయనం చేసి నివేదికను అందించాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన పరికరాలతో పాటు క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడే రేడియేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కంపెనీ ప్రతినిధులకు ఆయన సూచించారు.