Home » CM Revanth Reddy
ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో 10, 11 తేదీల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే మరికొన్ని ఇతర జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
తెలంగాణలో కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ఆస్తుల కింద రాష్ట్ర ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు తెలిపారు. గత ముఖ్యమంత్రులు రాజశేఖర్ రెడ్డి, రోశయ్య ఇతరులకు ఈ విషయం గురించి చెప్పానని.. వారు పట్టించుకోలేదని .గోనె ప్రకాష్ రావు గుర్తుచేశారు.
హైదరాబాద్ మహా నగరంలో భారీ వర్షాలు కురిసినా తట్టుకునేందుకు వీలుగా వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డలకు ఆర్థిక సాధికారత కల్పించడమే అసలైన రక్షా బంధన్ అని అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని మంత్రి పొంగులేటి తెలిపారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ చూసి బీఆర్ఎస్ నేతలను తెలంగాణ ప్రజలందరూ.. అసహ్యించుకుంటున్నారని విమర్శించారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కకుండా బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలే అడ్డుపడుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. 42 శాతం రిజర్వేషన్ల పెంపునకు కనీస నైతిక మద్దతు తెలపకుండా బీఆర్‌ఎస్, రిజర్వేషన్లు 50 శాతానికి మించిపోతాయంటూ బీజేపీ బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని సీఎం మండిపడ్డారు.
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం తెలిపేలా కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంటులో ఒత్తిడి తేవాలని ఏఐసీసీ చీఫ్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కొత్తగా జైల్లో పెట్టాల్సిన పని లేదని, ఆయనకు ఎర్రవల్లి ఫాంహౌసే చర్లపల్లి జైలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన తనను తాను జైల్లో పెట్టుకున్నారని చెప్పారు.
వాతావరణ శాఖ తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో అర్ధరాత్రి వరకు భారీ వర్ష పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. GHMC, పోలీసులు, హైడ్రా విభాగాల అధికారులతో సహా.. కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు.
రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ రాకుండా మోదీ, అమిత్‌షా అడ్డుకున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ దక్కకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ ఎప్పుడూ అన్యాయం చేస్తూనే ఉందని విమర్శించారు. రిజర్వేషన్లపై బీజేపీ నేతలు వితండవాదం చేస్తున్నారని పేర్కొన్నారు.