CM Revanth Reddy: హైదరాబాద్‌లో భారీ వర్షం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
ABN , Publish Date - Aug 07 , 2025 | 09:21 PM
వాతావరణ శాఖ తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో అర్ధరాత్రి వరకు భారీ వర్ష పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. GHMC, పోలీసులు, హైడ్రా విభాగాల అధికారులతో సహా.. కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు.
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరమంత జలమయం అయిపోయింది. కురుస్తున్న భారీ వర్షాలకు ఒక్కసారిగా జనసంచారం స్థంభించిపోయింది. నగరంలో రోడ్లలన్ని జలమయం అయిపోయాయి. పలు కాలనీలు జలదిగ్బంధం అయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
అధికారులకు సూచనలు..
వాతావరణ శాఖ తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో అర్ధరాత్రి వరకు భారీ వర్ష పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. GHMC, పోలీసులు, హైడ్రా విభాగాల అధికారులతో సహా.. కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. అన్ని విభాగాలతో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.
అవసరమైతేనే బయటకు రండి..
అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావాలని సీఎం రేవంత్ సూచించారు. ట్రాఫిక్, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర అప్రమత్తంగా ఉండాలని వివరించారు. ఎక్కడా నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గువ్వల రాజీనామా.. స్పందించిన బీఆర్ఎస్
తురకా కిషోర్‌ను తక్షణమే విడుదల చేయండి: హైకోర్టు