Rain Alert: రానున్న ఏడు రోజుల్లో భారీ వర్షాలు..హెచ్చరించిన భారత వాతావరణ శాఖ
ABN , Publish Date - Aug 09 , 2025 | 04:53 PM
ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో 10, 11 తేదీల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే మరికొన్ని ఇతర జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో ఇవాళ్టి(శనివారం) నుంచి 15వ తేదీ వరకూ.. అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రానున్న 7 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షలు పడే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. వర్షాలకు సంబంధించిన సూచనలు, హెచ్చరికలను ఓ ప్రకటన ద్వారా వాతావరణ శాఖ విడుదల చేసింది.
ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో 10, 11 తేదీల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. 12, 13, 15 తేదీల్లో ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు(గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని భారత వాతావరణశాఖ స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. పోలీసులు, వివిధ విభాగాల అధికారులతో సహా.. కలెక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించింది. అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ.. ప్రజల రక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
సృష్టి కేసులో వైసీపీ నేత సోదరుడు పాత్రపై అనుమానాలు
మహిళల రక్షణ మా బాధ్యత.. సీఎం చంద్రబాబు, రేవంత్‌రెడ్డి రాఖీ శుభాకాంక్షలు