Ponguleti Srinivasa Reddy: కమీషన్ల కోసమే కాళేశ్వరం : మంత్రి పొంగులేటి
ABN , Publish Date - Aug 08 , 2025 | 03:13 PM
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని మంత్రి పొంగులేటి తెలిపారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ చూసి బీఆర్ఎస్ నేతలను తెలంగాణ ప్రజలందరూ.. అసహ్యించుకుంటున్నారని విమర్శించారు.
హనుమకొండ: గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కమీషన్ల కోసమే కట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను ఆపేందుకు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుట్రచేస్తున్నాయని విమర్శించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని మంత్రి పొంగులేటి తెలిపారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ చూసి, బీఆర్ఎస్ నేతలను తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. అయినా కూడా బీఆర్ఎస్ నేతలు నిస్సిగ్గుగా తమపై ఎదురుదాడి చేస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పేదవాళ్లకు సక్రమంగా ఇల్లు ఇస్తే ఇవాళ ఇల్లు అడిగేవారు కాదని స్పష్టం చేశారు.
ప్రతి పథకంలో కమీషన్ కోసమే నాటి ప్రభుత్వం పని చేసిందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా జిల్లా కేంద్రంలో 592 మందికి డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీ చేసినట్లు స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వచ్చిన 18 నెలలుగా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా దూసుకుపోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారిణి రహిమున్నీసాబేగానికి తొలి పట్టా అందించినట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
వెదర్ అప్‌డేట్స్.. ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
కీలక పరిణామం.. బీజీపీలోకి గువ్వల బాలరాజు