Home » CM Revanth Reddy
దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో 12 మంది తమపై క్రిమినల్ కేసులున్నాయని ప్రకటించారు. దీనికి సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్....
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. 1623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి రేవంత్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈకో గణేశ్, గ్రీన్ గణేశ్ కాన్సెప్ట్‌ను ప్రోత్సహిస్తూ.. నగరంలో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు హెచ్ఎండీఏ చెప్పుకొచ్చింది. మట్టి వినాయక విగ్రహాల వాడకం ద్వారా ప్లాస్టిక్ వినియోగం తగ్గించి పర్యావరణ పరిరక్షణకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు పేర్కొన్నారు
ఎంపీ లక్ష్మణ్ ఇవాళ మీడియాతో మాట్లాడారు.. పదిహేను బిల్లులు ఉభయ సభల్లో ఆమోదం తెలిపితే ఒక్క చర్చలో కూడా కాంగ్రెస్ పాల్గొనలేదని తెలిపారు. చర్చలో పాల్గొనకుండా కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్‌కి ఎజెండా లేకుండా పోయిందని విమర్శించారు.
జర్నలిస్టులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. జర్నలిస్టులారా.... బాధపడకండి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వైఫల్యాలవల్లే మీకు ఇళ్ల స్థలాలు రావడం లేదని ఆందోళన వ్యక్త చేశారు. న్యాయ నిపుణులతో చర్చించకుండా తూతూ మంత్రంగా జీవో ఇవ్వడంవల్లే ఈ దుస్థితి వచ్చిందని వాపోయారు. ఓట్ల కోసం ఆ రెండు పార్టీలు అడ్డగోలు హామీలిస్తూ అధికారంలోకి వచ్చాక గాలికొదిలేస్తున్నాయని బండి సంజయ్ ధ్వజమెత్తారు.
ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీల్లో ఫీజుల నిర్దారణకు ప్రస్తుతం ఉన్న నిబంధనల్లో సవరణలను చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కళాశాలల్లో బోధనా ప్రమాణాలు, నిబంధనలు పాటిస్తున్నాయా లేదా అన్న అంశాలను పరిగణలోకి తీసుకుని మాత్రమే ఫీజులు పెంచేందుకు అనుమతి ఇచ్చింది.
వరంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి కొండా సురేఖ తెలిపారు. వరంగల్ ముంపునకు గురవుతుండడానికి నాలాల ఆక్రమణే కారణమని గుర్తించినట్లు పేర్కొన్నారు. వాటికి సంబంధించి DPR సిద్ధం చేస్తున్నట్లు, వరంగల్‌ను ముంపు ప్రాంతాలు లేని నగరంగా మార్చుతామని ధీమా వ్యక్తం చేశారు.
పోలీస్ శాఖలో నకిలీ సర్టిఫికెట్లు వెల్కిరావడంతో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఇలా నకిలీ సర్టిఫికెట్లతో ఎంతమంది పోలీసులు ఉద్యోగాలు చేస్తున్నారో.. అనే అనుమానాలకు ఈ ఘటన తావిస్తోంది.
హైకోర్టులో భారతి ఎయిర్‌టెల్ తరుపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లు వేసుకునేందుకు.. రూ.21 కోట్లు ప్రభుత్వానికి చెల్లించామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నుంచి పరిమిషన్ వచ్చిన తర్వతే.. విద్యుత్ స్తంభాలపై నుంచి వైర్లు వేసామని పేర్కొన్నారు.
కేసీఆర్ గోదావరి జలాలతో రైతుల పాదాలు కడిగితే, రేవంత్‌రెడ్డి యూరియా కోసం రైతులతో పోలీసుల కాళ్లు మొక్కిస్తున్నాడని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు.