High Court: నేడు హైకోర్టులో కేబుల్ వైర్ల తొలగింపుపై విచారణ..
ABN , Publish Date - Aug 21 , 2025 | 09:22 AM
హైకోర్టులో భారతి ఎయిర్‌టెల్ తరుపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లు వేసుకునేందుకు.. రూ.21 కోట్లు ప్రభుత్వానికి చెల్లించామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నుంచి పరిమిషన్ వచ్చిన తర్వతే.. విద్యుత్ స్తంభాలపై నుంచి వైర్లు వేసామని పేర్కొన్నారు.
హైదరాబాద్: నగరంలో కేబుల్ వైర్ల తొలగింపు అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రామంతాపూర్ ఘటనతో సిటీలో విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్, ఇంటర్నెట్ వైర్లను విద్యుత్ శాఖ అధికారులు తొలగిస్తున్నారు. ప్రభుత్వం కూడా విద్యుత్ అధికారులకు సపోర్ట్ చేయడంతో ఈ ప్రక్రియ మరింత జోరందుకుంది. ఈ మేరకు కేబుల్ వైర్ల తొలగింపు ప్రక్రియ ఆపాలని.. భారతి ఎయిర్‌టెల్ నిన్న తెలంగాణ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు నిన్న పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపి ఈ రోజుకు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ(గురువారం) వైర్ల తొలగింపుపై హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది.
అయితే నిన్న హైకోర్టులో భారతి ఎయిర్‌టెల్ తరుపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లు వేసుకునేందుకు.. రూ.21 కోట్లు ప్రభుత్వానికి చెల్లించామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నుంచి పరిమిషన్ వచ్చిన తర్వతే.. విద్యుత్ స్తంభాలపై వైర్లు వేసామని పేర్కొన్నారు. ఇప్పుడు ఇలా ఆకస్మత్తుగా వైర్లు కట్ చేయడం భావ్యం కాదని కోర్టుకు వివరించారు. వాదనలపై స్పందించిన న్యాయస్థానం.. రామంతాపూర్ ఘటనలో మృతిచెందిన ఆరుగురి బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించింది. వైర్ల తొలగింపుకు సంబంధించి పూర్తి నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటివరకు కేబుల్ వైర్ల కటింగ్ ఆపాలని హైకోర్టు సూచించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
అర్హులైన చేనేతలందరికీ ముద్ర రుణాలు
శ్రీవారికి 121 కిలోల బంగారు కానుక