Minister Konda Surekha: కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు సాధారణం.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 21 , 2025 | 12:19 PM
వరంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి కొండా సురేఖ తెలిపారు. వరంగల్ ముంపునకు గురవుతుండడానికి నాలాల ఆక్రమణే కారణమని గుర్తించినట్లు పేర్కొన్నారు. వాటికి సంబంధించి DPR సిద్ధం చేస్తున్నట్లు, వరంగల్‌ను ముంపు ప్రాంతాలు లేని నగరంగా మార్చుతామని ధీమా వ్యక్తం చేశారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు సర్వసాధారణమని పర్యావరణం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సాధారణ వర్గ విభేదాలను ప్రతిపక్షలు తప్పుడు కోణంలో చూస్తూ.. తప్పడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఏ పార్టీలో అయిన వర్గ విభేదాలు ఉంటాయని, సమయాన్ని బట్టి అవి బయటకు వస్తాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఇవాళ(గురువారం) ఏబీఎన్‌తో మాట్లాడారు.
వరంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి కొండా సురేఖ తెలిపారు. వరంగల్ ముంపునకు గురవుతుండడానికి నాలాల ఆక్రమణే కారణమని గుర్తించినట్లు పేర్కొన్నారు. వాటికి సంబంధించి DPR సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. వరంగల్‌ను ముంపు ప్రాంతాలు లేని నగరంగా మార్చుతామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటు చోరీ ఉద్యమానికి భారీ స్పందన వస్తోందని తెలిపారు. దొంగ ఓట్లతోనే అన్ని రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తోందని ఆరోపించారు. ప్రధాని మోదీకి మొదటి నుంచి తెలంగాణ అంటే ఇష్టం లేదని.. అందుకోసమే రాష్ట్రానికి యూరియా ఇవ్వడం లేదని మండిపడ్డారు. యూరియా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తుందని చెప్పుకొచ్చారు.
కాళేశ్వరం నివేదికతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమాలు బట్టబయలయ్యాయని మంత్రి సురేఖ విమర్శించారు. నివేదికలో మాజీ సీఎం కేసీఆరే.. ప్రధాన సూత్రధారిగా తేలిందని ఆరోపించారు. నివేదికలో నిజాలు బయటపడ్డ బీఆర్ఎస్ నేతలు ప్రజలకు కళ్ళబుల్లి మాటలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీలు రాష్ట్ర ప్రజలకు విష ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు. బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్న కేంద్రం నుంచి యూరియా తేలేకపోయారని విమర్శించారు. తెలంగాణలో మోదీ భజన చేయడంలో ఉన్న శ్రద్ధ వారికి రైతుల మీద లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీపై ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు తమ వైపే ఉన్నారని కొండా సురేఖ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
టీడీపీ ఎమ్మెల్యేకు బెదిరింపులు..
శ్రావణ మాసం.. ఆఖరి శుక్రవారం..