Home » CM Chandrababu Naidu
దశాబ్దాలుగా ఇళ్ల హక్కుల కోసం ఎదురుచూస్తున్న వేలాది పేద కుటుంబాల కలను సాకారం చేస్తున్నామంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
ఒరిజినల్ రెడ్ల ఆత్మగౌరవ పౌరుషాన్ని కాపాడే విధంగా తాను త్వరలో పార్టీ పెడుతున్నానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. అన్ని కులాలు, మతాలను గౌరవించే పార్టీ ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు.
ఏపీలోని దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఎండీఎల్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ ఎంవోయూ చేసుకున్నారు.
‘సుస్థిరతతో నమ్మకం పెరుగుతుంది. నమ్మకంతో పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడుల వల్ల ఉద్యోగాలు సమకూరుతాయి. అభివృద్ధీ జరుగుతుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రధాని మోదీని దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడిగా అభివర్ణించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా వాద్ నగర్ సేవా సంకల్ప అభియాన్ యాత్రలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పలువురు కేంద్ర మంత్రులతో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
విద్యుత్ శాఖపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. వేసవిని తలపించే ఎండల వల్ల 50 మిలియన్ యూనిట్లు అధికంగా డిమాండ్ ఉందని తెలిపారు.
వారణాసిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా వారణాసిలో శ్రీకాశీ విశ్వనాథ్ స్వామిని సీఎం దర్శించుకున్నారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నేడు ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
రామాయపట్నం పోర్టు సమీపంలో భారీ పెట్టుబడులతో చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రో కెమికల్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్)ను సీఎం చంద్రబాబు కోరారు. ఆ రిఫైనరీ సమీపంలో డౌన్‌స్ట్రీమ్ (శుద్ధి చేసి వినియోగానికి సిద్ధంగా ఉన్న) పెట్రో కెమికల్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని తాజాగా ప్రతిపాదించారు.
రాష్ట్రంలోని అన్ని రంగాలు, వర్గాలను బలోపేతం చేసేలా బ్యాంకులు విస్తృతంగా రుణాలు అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు. 236వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో బ్యాంకర్లు, అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.