Home » CM Chandrababu Naidu
పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో అమరావతి- విశాఖపట్నంలో జరుగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ(ఆదివారం) ఏపీ సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.
నాటి వైసీపీ పాలనలో మద్యంలో కూడా హానికర పదార్థాలు ఉన్నాయని రిపోర్ట్ వచ్చిందని మంత్రి పార్థసారథి వెల్లడించారు. అయితే ఈరోజు మద్యం పరీక్షల్లో హానికర పదార్థాలు లేవని రిపోర్ట్ వచ్చిందని.. అది కూటమి ప్రభుత్వ నిస్పక్ష ధోరణి అని చెప్పుకొచ్చారు.
ఈ దీపావళికి ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త సర్కారు నుంచి ఆశిస్తున్నామని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపటాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.
కేఎల్ యూనివర్సిటీ నుంచి లాంచ్ అవుతున్న శాటిలైట్లు వాతావరణం, ఓజోన్ పొర, హెల్త్ ఇలా వివిధ అంశాలకు సంబంధించి డేటా అందిస్తాయని భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్, సీఎం చంద్రబాబు విజన్ ఆంధ్ర.. కలిసి మంచి ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉద్యోగ సంఘాలతో ఏపీ సచివాలయంలో సమావేశం కానున్నారు. ఉద్యోగ సంఘాలతో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు సీఎం చంద్రబాబు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటన విజయవంతమైందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మంత్రులు, వివిధ శాఖల అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు.
16 నెలల్లో 1 లక్ష కోట్ల రూపాయలకు మించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నా సీఎం. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా నెలనెలా రూ.2,758 కోట్లతో ‘ఎన్టీఆర్ భరోసా పింఛన్లు’ అందిస్తున్నామని తెలిపారు.
పార్లమెంట్లో బీసీ బిల్లు చంద్రబాబుతోనే సాధ్యమని ఎన్ మారేష్ స్పష్టం చేశారు. ఓబీసీల గుండెల్లో చిరస్థాయిగా చంద్రబాబు మిగిలిపోతారని తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరూ లాభం పొందారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నన్నూరులో 'సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్' బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. మోదీతోపాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ ఉన్నారు. ఈ మేరకు భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నారు.