Share News

AP Govt: ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ

ABN , Publish Date - Dec 26 , 2025 | 03:26 PM

ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు కూటమి ప్రభత్వం తీపి కబురు చెప్పింది. ప్రభుత్వంలో విలీనం అనంతరం మెడికల్ అన్ ఫిట్ అయిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలివ్వాలని సర్కార్ నిర్ణయించింది.

AP Govt: ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ
AP Govt

అమరావతి, డిసెంబర్ 26: మెడికల్ అన్ ఫిట్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం (AP Govt) శుభవార్త చెప్పింది. మెడికల్ అన్ ఫిట్ అయిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలివ్వాలని నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వంలో విలీనం అనంతరం మెడికల్ అన్ ఫిట్ అయిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలివ్వాలని సర్కార్ నిర్ణయించింది. 2020 జనవరి 1 తర్వాత మెడికల్ అన్ ఫిట్ అయిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వనున్నారు. విలీనానికి ముందు మెడికల్ అన్ ఫిట్ అయిన డ్రైవర్లకు మాత్రమే ప్రత్యామ్నాయ ఉద్యోగాలిచ్చే విధానం ఉండదే. ఇకపై ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు, సహా మిగిలిన ఉద్యోగులందరికీ ప్రత్నామ్నాయ ఉద్యోగాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.


కార్పోరేషన్‌లో ఉండగా 21 కేటగిరీ‌లో మెడికల్ అన్ ఫిట్ అయిన వారికి ప్రత్నామ్నాయ ఉద్యోగాలు ఇవ్వనున్నారు. విలీనం తర్వాత కూడా 21 కేటగిరీల్లో మెడికల్ అన్ ఫిట్ అయిన వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలివ్వాలని సర్కార్ నిర్ణయించింది. మెడికల్ అన్ ఫిట్ అయిన వారికి కండక్టర్, రికార్డు ట్రేసర్, అసిస్టెంట్ మెకానిక్ /శ్రామిక్ ఉద్యోగాలివ్వాలని నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీలో ఇచ్చే ఉద్యోగానికి అర్హత లేకపోతే ప్రభుత్వ విభాగాల్లో అర్హత బట్టి ఉద్యోగాలివ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కలెక్టర్ల ద్వారా ప్రభుత్వ విభాగాల్లో అర్హత మేరకు ఉద్యోగాలివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏ ఉద్యోగానికీ అర్హత లేని వారికి అదనపు మానిటరీ ప్రయోజనాలు ఇవ్వాలని స్పష్టం చేసింది.


మెడికల్ అన్ ఫిట్ వల్ల వాలంటరీ రిటైర్డ్ అవ్వాలనుకునే వారికి అదనపు మానిటరీ ప్రయోజనాలు చేకూరేలా తదుపరి చర్యలు తీసుకోవాలని ఎపీపీటీడీ కమిషనర్‌కు ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. అలాగే తదుపరి చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లా కలెక్టర్లకు సర్కార్ ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి .కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు.


మరోవైపు ఆర్టీసీలో ఉద్యోగులందరికీ ప్రయోజనాలివ్వడంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మెడికల్ అన్ ఫిట్ అయిన ఉద్యోగులందరికీ ప్రత్నామ్నాయ ఉద్యోగాలివ్వడంపై ఆనందం తెలుపుతున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ఆర్టీసీ ఎన్‌ఎంయూఎ నేతలతో పాటు ఆర్టీసీ ఈయూ, కార్మిక పరిషత్ నేతలు ధన్యవాదాలు తెలియజేశారు.


ఇవి కూడా చదవండి...

వేల సిమ్ కార్డులు, టెక్నో పరికరాలతో కోట్లల్లో ఫ్రాడ్.. చివరకు పాపం పండి

నిమ్మకూరు రావడం ఓ స్వీట్ మెమోరీ: భువనేశ్వరి

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 26 , 2025 | 04:02 PM