Home » CM Chandrababu Naidu
రెండో రోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ అబుదాబిలో పర్యటించనున్నారు. పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశాలు జరపనున్నారు.
కోనసీమ జిల్లాలో అక్టోబర్ 8వ తేదీన బాణాసంచా పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 10 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. అయితే, మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు పరిహారం ప్రకటించారు.
రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం ముఖ్యమంత్రి బృందం రేపటి నుంచి 3 రోజుల పాటు యూఏఈలో పర్యటించనుంది. విశాఖలో జరగనున్న పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు వివిధ సంస్థల ప్రతినిధులను సీఎం చంద్రబాబు ఆహ్వానించనున్నారు.
క్రిమినల్స్ అప్డేట్ అవుతున్నారని.. వారి కంటే ముందుండకపోతే కట్టడి చేయలేమని సీఎం అన్నారు. అన్ని ఇజంలను అరికట్టాలంటే సమర్థంగా ఉండాలని చెప్పారు. గూగుల్ సంస్థ పెట్టుబడులు వైజాగ్ వచ్చాయంటే దానికి కారణం నమ్మకం.. శాంతి భద్రతలపై నమ్మకంతో పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు.
సీఎం చంద్రబాబు మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈరోజు నుంచి విదేశీ పర్యటనలో ఉండనున్నారు. దుబాయ్, అబుదాబి, UAEలో పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో దీపావళి సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పల్లె, పట్టణాలు, నగరాలు అని తేడా లేకుండా వీధులన్నీ ప్రజలతో నిండిపోయాయి. ఇవాళ (సోమవారం) సాయంత్రం నుంచే వయసుతో సంబంధం లేకుండా ప్రజలంతా రోడ్లపైకి వచ్చి టపాసులు పేలుస్తూ ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు.
చెత్త నుంచి సంపద సృష్టించాలన్న లక్ష్యంతో గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామంలోనూ చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఎలక్ట్రిక్ అటోలను కొనుగోలు చేశారు. అయితే, గత వైసీపీ సర్కారు వీటన్నింటినీ పక్కన పెట్టేసింది.
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్బానాయుడు మృతి పార్టీకి తీరని లోటు అని మంత్రి నారాయణ తన ఆవేదన వ్యక్తం చేశారు. సుబ్బానాయుడు కుటుంబ సభ్యులు, బంధువులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
జీఎస్టీ సెలబ్రేషన్స్‌ని దసరాతో ప్రారంభించి దీపావళితో ముగిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వంలో ఇటువంటి పండగలు జరుపుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదని అన్నారు. సూపర్ జీఎస్టీ పండుగను వ్యాపారస్తులంతా చాలా చక్కగా జరుపుకుంటున్నారని చెప్పారు చంద్రబాబు.
విజయవాడ బీసెంట్ రోడ్డులో సీఎం పర్యటించారు. చిరు, వీధి వ్యాపారులతో ముచ్చటించారు. జీఎస్టీ సంస్కరణల అనంతరం వారికి కలుగుతున్న ప్రయోజనాల గురించి ఆరా తీశారు.