Share News

CM Chandrababu: హత్య చేస్తే పోస్టుమార్టమే.. కుప్పిగంతులు ఆపండి.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

ABN , Publish Date - Dec 26 , 2025 | 04:25 PM

రాజకీయ ముసుగులో చేసే నేరాలు అంగీకరించేది లేదని సీఎం చంద్రబాబు అన్నారు. తప్పు చేసిన వారు తప్పించుకోలేరని స్పష్టం చేశారు.

CM Chandrababu: హత్య చేస్తే పోస్టుమార్టమే.. కుప్పిగంతులు ఆపండి.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu

తిరుపతి, డిసెంబర్ 26: హత్య చేసే వారికి పోస్ట్‌మార్టం తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం నాడు జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో మళ్ళీ రౌడీయిజం పెరిగిందని... అదే సరైనదని ఇంకా వాళ్ళు నమ్ముతున్నారని మండిపడ్డారు. రప్పా రప్పా... అని పోస్టర్‌లు వేసి బెదిరిస్తున్నారని ఫైర్ అయ్యారు. జంతువులను బలి ఇచ్చి, ఆ రక్తంతో పోస్టర్‌పై రక్తాభిషేకం చేయడం చూశానని.. ఇష్టారాజ్యంగా చేస్తే, ఎవరినీ వదిలి పెట్టను అంటూ హెచ్చరించారు.


సోషల్ మీడియాలో కొందరు చెలరేగిపోతున్నారని.. దీన్ని అంగీకరించని స్పష్టం చేశారు. అది ఆమోదయోగ్యం కాదన్నారు. కూటమి వాళ్ళు చేయరని.. తప్పు చేసిన వారు తప్పించుకోలేరని అన్నారు. రాజకీయ ముసుగులో చేసే నేరాలు అంగీకరించేది లేదన్నారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అంతా అప్రమత్తంగా ఉండాలని.. టీటీడీ, పోలీసులు సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు.


తిరుపతిని నేరాలు లేని సిటీగా చూడాలని... తిరుపతి ఒక ఫ్యూచర్ సిటీ అంటూ వెల్లడించారు. ఇక్కడ నోరు పారేసుకున్న, ఇష్టారాజ్యంగా చేసినా వదిలిపెట్టనని వార్న్ చేశారు. ఇక్కడే పుట్టిన తనకు, ఇక్కడి అన్ని విషయాలు తెలుసన్నారు. తిరుపతి వేంకటేశ్వరస్వామి ఉండే ప్రాంతమని... ఈ ప్రాంత పవిత్రత కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ఇక్కడ కుప్పిగంతులు వేయాలనుకున్నా వారి ఆటలు సాగవని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

వేల సిమ్ కార్డులు, టెక్నో పరికరాలతో కోట్లల్లో ఫ్రాడ్.. చివరకు పాపం పండి

నిమ్మకూరు రావడం ఓ స్వీట్ మెమోరీ: భువనేశ్వరి

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 26 , 2025 | 04:44 PM