Home » Chennai News
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌తో ఎవరినీ పోల్చలేమంటూ ఆయన పేర్కొనడం గమనార్హం. మరికొద్ది రోజుల్లో తమిళనాడు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పొలిటికల్ హీట్ పెరిగింది.
మరికొద్దిరోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సినీ నటీనటులకు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాజపాళయంలో గౌతమి, మైలాపూరు నుంచి గాయత్రి రఘురామ్ పోటీచేస్తున్నట్లు సమాచారం. ఈమేరకు వారు ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తానని ఎంఎన్‌ఎం పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు కమల్‌హాసన్ అన్నారు. ఆయన మాట్లాడుతూ... ఎన్నికల్లో డీఎంకే విజయం ఖాయమని, అన్నాడీఎంకేకు ఓటమి తప్పదని కమల్ అన్నారు.
నా విజయం వెనుక భార్య త్యాగం ఉంది.. ఇల్లాలి మాటను భర్త శిరసావహించాలి.. అని అన్నారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. భార్య చెప్పే మంచిమాటలను భర్త శిరసావహించాలని, అప్పు డే అన్యోన్య దాంపత్యం సాగుతుందన్నారు. కొళత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, అందరూ చిన్నమ్మగా పిలిచే శశికళ దారెటు.., ఆమె నిర్ణయం ఏమిటన్న దానిపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. మరో కొద్ది నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో.. ఆమె ఎవరికి మద్దతుగా నిలుస్తారో అన్ని పలువురు చర్చించుకుంటున్నారు.
రాష్ట్రంలో.. ఐదు రోజులపాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా.. చెన్నైలో రానున్న 48 గంటల వరకు ఆకాశం మేఘావృతంగా ఉంటుందని తెలిపింది.
ఊటీ వెళ్లే పర్యాటకులకు అటవీశాఖ కొత్త నిబంధనలను విధించింది. క్రిస్మస్, నూతన సంవత్సరం సెలవుల్లో ఊటీకి పెద్దసంఖ్యలో పర్యాటకులు విచ్చేస్తుంటారు. అయితే.. వీరు కొన్ని నిబంధనలను పాటించాలని సూచిస్తో్ంది. అటవీ శాఖ అనుమతించిన పర్యాటక ప్రాంతాలను మాత్రమే సందర్శించాలని నిబంధనలు విధించడం గమనార్హం.
ఓ మహిళను చంపేసిన పులి ఎట్టకేలకు చిక్కడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నీలగిరి జిల్లాలో గత నెల 24వ తేది పులి మహిళపై దాడిచేసి చంపేసింది. కాగా.. ఆ పులిని బంధించేందుకు అటవీ అధికారులు ప్రయత్నించి ఎట్టకేలకు దానిని బంధించడంతో ఈ ఏరియా వాసులు ఊపిరి పీల్చుకున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు తేదీ దగ్గర పడుతున్నాకొద్దీ రాష్ట్రంలో రాజకీ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఒంటరిగా పోటీ చేయాలా... లేక కూటమిలో చేరాలా అన్నదానిపై నిర్ణయాధికారం విజయ్‌దేనని టీవీకే పార్టీ నేతలు తెలిపారు. ఈమేరకు టీవీకే జిల్లా కార్యదర్శుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న తరుణంలో.. అగ్రహీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్‌కి అతని సన్నిహితుడు, ఇప్పటివరకు ఆయన వెన్నంటి ఉన్న పీటీ సెల్వకుమార్ ఝలక్ ఇచ్చారు. ఆయన టీవీకేని వదిలి డీఎంకే పార్టీలో చేరారు.