Share News

Leopard: ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. అక్కడ చిరుత సంచారం ఉంది..

ABN , Publish Date - Jan 04 , 2026 | 01:02 PM

ఆ ఏరియాలో చిరుతపులి సంచారం ఉందని, గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖాధికారులు తెలుపుతున్నారు. కడలూరు సమీపం అరిసిపెరియంకుప్పం ప్రాంతంలో నయినార్‌ అనే రైతుకు చెందిన పొలంలో చిరుత కాలిముద్రలను గుర్తించారు.

Leopard: ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. అక్కడ చిరుత సంచారం ఉంది..

- కడలూరు వద్ద చిరుత సంచారం

చెన్నై: కడలూరు సమీపం అరిసిపెరియంకుప్పం ప్రాంతంలో నయినార్‌ అనే రైతుకు చెందిన పొలంలో ఆదివారం ఉదయం చిరుతపులి(Leopard) సంచరించింది. నయినార్‌ తన పొలంలో వేసిన వేరుశెనగ పంట వద్ద పక్షులు సంచరించకుండా రోజూ ఉదయం పూట టపాసులు పేల్చుతున్నారు. ఆ మేరకు శనివారం ఉదయం పొలం వద్దకు వెళ్ళినప్పుడు పొలం నుండి ఓ చిరుతపులి సమీప ప్రాంతంలో ఉన్న అడవిలోకి పారిపోయింది. దీనిపై ఆయన అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అటవీ శాఖ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిశీలించి పొలంలో చిరుతపులి కాలిముద్ర గుర్తించారు.


nani3.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

తెలుగు రాష్ట్రాల్లో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 04 , 2026 | 01:02 PM