Train cancellations: పొంగల్ ఎఫెక్ట్.. ప్రయాణికులు లేక ఐదు ప్రత్యేక రైళ్ల రద్దు
ABN , Publish Date - Jan 15 , 2026 | 01:47 PM
సంక్రాంతి పండుగ వల్ల ప్రయాణికులు లేకపోవడంతో ఐదు ప్రత్యేక రైళ్లను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పట్టణాల నుంచి పెద్దఎత్తున తమతమ స్వస్థలాలకు వెళ్లారు. దీంతో చెన్నై మహానగరం ఖాళీ అయిపోయింది.
చెన్నై: పొంగల్(Pongal) సందర్భంగా ప్రకటించిన ఐదు ప్రత్యేక రైళ్లు పూర్తిగా రద్దు చేశారు. ఈ మేరకు దక్షిణ రైల్వే(Southern Railway) విడుదల చేసిన ప్రకటనలో వివరాలిలా ఉన్నాయి... తాంబరం నుంచి ఈ నెల 19వ తేది మధ్యాహ్నం 3.30 గంటలకు బయల్దేరే ప్రత్యేక రైలు (నెం.06011), తాంబరం నుంచి నాగర్‌కోయిల్(Tambaram to Nagercoil)కు ఈ నెల 21వ తేది మధ్యాహ్నం 12.30 గంటలకు బయల్దేరే ప్రత్యేక రైలు (నెం.06053), చెన్నై సెంట్రల్ నుంచి కోవైకు ఈ నెల 10వ తేది రాత్రి 11.25 గంటలకు బయల్దేరే ప్రత్యేక రైలు (నెం.06033) రద్దయ్యాయి.ః

అలాగే, పోతనూరు నుంచి ఈ నెల 21వ తేది రాత్రి 12.35 గంటలకు చెన్నై సెంట్రల్‌కు వెళ్లే ప్రత్యేక రైలు (నెం.06024), చెన్నై సెంట్రల్ నుంచి ఈ నెల 21వ తేది మధ్యాహ్నం 1.50 గంటలకు పోతనూరు వెళ్లే ప్రత్యేక రైలు (06023) పూర్తిగా రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి.
మరింత పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
20 నుంచి వన్యప్రాణుల లెక్కింపు షురూ..
Read Latest Telangana News and National News