Chennai News: మీరు కొడైకెనాల్‌కు వెళ్తున్నారా.. అయితే ముందు ఈ విషయం తెలుసుకోవాల్సిందే మరి..
ABN , Publish Date - Jan 04 , 2026 | 12:27 PM
తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన కొడైకెనాల్‌లో వాహనాల ప్రవేశ రుసుమును రాష్ట్రప్రభుత్వం పెంచింది. బస్సులకు ప్రవేశ రుసుము రూ.250 వసూలుచేస్తుండగా రూ.300లకు పెరిగింది. అలాగే మిగిలిన వాహనాలకు కూడా పెంచారు.
- కొడైకెనాల్‌లో వాహనాల ప్రవేశ రుసుము పెంపు
చెన్నై: ప్రముఖ పర్యాటక కేంద్రం కొడైకెనాల్(Kodaikanal)లో వాహనాల ప్రవేశ రుసుము పెంపు శనివారం నుంచి అమలుకు వచ్చింది. కొడైకెనాల్‌కు ప్రతిరోజు దేశ, విదేశీ పర్యాటకులు వస్తుంటారు. పర్యాటకుల అధికంగా సొంత వాహనాల్లో వస్తుండడంతో ట్రాఫిక్ రద్దీ కూడా అధికంగా ఉంటోంది. ఈ క్రమంలో పర్యాటకుల వాహనాల ప్రవేశ రుసుము పెంచుతూ జిల్లా యంత్రాంగం ప్రకటన చేసింది.

ఆ ప్రకారం, బస్సులకు ప్రవేశ రుసుము రూ.250 వసూలుచేస్తుండగా రూ.300లకు పెరిగింది. లోడు వాహనాల రుసుము రూ.100 నుంచి రూ.150, కారు, జీపు తదితరాలకు రూ.60 నుంచి రూ.80, వ్యాన్‌లకు రూ.80 నుంచి రూ.100 పెంచారు. సిల్వర్ ఫాల్స్ సమీపంలోని టోల్ బూత్ వద్ద వాహనాల ప్రవేశ రుసుము వసూలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..
మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
తెలుగు రాష్ట్రాల్లో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు
Read Latest Telangana News and National News