Home » Chennai News
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరికొద్దిరోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది అన్నాడీఎంకే పార్టీనేనని ఆయన అన్నారు. ఎన్డీయే కూటమిలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పడాలని తాము ఆశిస్తున్నామన్నారు.
అగ్రహీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ పుదుచ్చేరిలో నిర్వహించతలపెట్టిన రోడ్‌షోలకు అనుమతి ఇవ్వలేమంటూ.. పోలీస్ శాఖ పేర్కొంది. చిన్ననగరమైన పుదుచ్చేరిలో రోడ్‌షో నిర్వహిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, తమిళనాడులో లాగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటూ పోలీస్ శాఖ పేర్కొంది.
రాజధాని చెన్నై నగరం తడిసి ముద్దవుతోంది. ఒకరోజు మొత్తం వర్షం విపరీతంగా కురవడంతో జనజీవనం అతలాకుతమైంది. ‘దిత్వా’ తుఫాన్ తీరందాటకుండానే బలహీనపడుతుండటంతో నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కాగా.. వర్షం కారణంగా మంగళవారం చెన్నై సహా 4 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.
కండక్టర్‌పై లా విద్యార్థిని చెప్పుతో దాడి చేసిన సంఘటన చెన్నై నగరంలో చోటుచేసుకుంది. దీనిపై రవాణా శాఖ ఉద్యోగులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఈ సంఘటన చెన్నై నగరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి.
రాష్ట్రంలో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఆగ్నేయ శ్రీలంక తీరం దిశగా నెలకొన్న వాయుగుండం ‘దిత్వా’ తుపానుగా మారి నగరానికి చేరువగా తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రెండు రోజులు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఉత్తరాది వారికి తమిళనాడు రాష్ట్రంలో ఓటు హక్కు కల్పించడమేంటని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత ప్రశ్పించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాది వాసులకు ఓటు హక్కు కల్పిస్తే, రాష్ట్ర ప్రజలు తిరుగుబాటు చేస్తారన్నారు
డిసెంబరు 5న పుదుచ్చేరిలో రోడ్ షోకు అనుమతి ఇవ్వాలని ఆపార్టీ నేతలు దరఖాస్తు చేసుకున్నారు. కరూర్ లో హీరో, టీవీకే పార్టీ నేత విజయ్ పాల్గొన్న సభలో తొక్కిసలాట జరిగి 41మంది మరణించిన సంగతి తెలిసిందే. దీంతో విజయ్ సభలకు ముందస్తు అనుమతులకు దరఖాస్తు చేసుకున్నారు.
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీసీఎం ఎడప్పాడి పళనిస్వామి రైతు కాదు... ద్రోహి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెను దుమారాన్ని రేపాయి. మరొకొద్ది రోజుల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతోంది.
తమిళనాడు రాష్ట్రంలోని దక్షిణాదిన ఉన్న జిల్లాలను వర్షం ముంచెత్తింది. అలాగే.. తంజావూరు జిల్లాలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు 22 ఇళ్లు ధ్వంసమయ్యాయి. వేలాది ఎకరాల్లో వరి, అరటి తోటలు నీట మునిగాయి. వివరాలిలా ఉన్నాయి.
తన తండ్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి 15 ఏళ్ల క్రితం ఇచ్చిన హామీని ఎట్టకేలకు తాను నెరవేర్చానని ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని కోయంబత్తూరులో సెమ్మొళి పూంగాను నిర్మిస్తానంటూ కరుణానిధి హామీని ఇప్పుడు నెరవేర్చానన్నారు.