EPS: తేల్చేసిన మాజీసీఎం.. విజయ్ పార్టీతో పొత్తు
ABN , Publish Date - Oct 14 , 2025 | 10:41 AM
వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో పొత్తు కుదుర్చుకోనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
- ఈపీఎస్ పరోక్ష వ్యాఖ్యలు
చెన్నై: వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సినీ నటుడు విజయ్(Vijay) నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో పొత్తు కుదుర్చుకోనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) పరోక్ష వ్యాఖ్యలు చేశారు. సేలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొంతమంది పాత్రికేయులు టీవీకే అధ్యక్షుడు విజయ్, ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ గురించి ప్రశ్నించారు. ఈపీఎస్ సమాధానం చెబుతూ, అన్నాడీఎంకేతో పొత్తు కుదుర్చుకోవాలంటూ ఆ పార్టీ ప్రధాన నాయకులు,

జిల్లా కార్యదర్శులు, కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నారని, అంతేకాకుండా తాను పాల్గొంటున్న ప్రచార సభల్లో టీవీకే జెండాలతో ఆ పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని తెలిపారు. టీవీకేతో పాటు మరికొన్ని పార్టీలతో పొత్తు కోసం చర్చించే అవకాశముందన్నారు. ఈ సారి తమ నేతృత్వంలో బలమైన కూటమి ఏర్పాటవుతుందన్నారు. తమ కూటమిలో ఉన్న పార్టీలు స్వేచ్ఛగా ఉంటాయని, అయితే డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, డీపీఐ, వామపక్షాలు అధికార పార్టీని విమర్శించకుండా బానిసలుగా ఉంటున్నాయని ఈపీఎస్ ఎద్దేవా చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..
దేవుడా.. చుక్కలనంటుతున్న పసిడి ధరలు
వెంకటేష్ నాయుడి ఫోన్ అన్‌లాక్‌కు అనుమతి
Read Latest Telangana News and National News