Chennai News: మా నాన్నకు ఏదైనా జరిగితే ఊరుకోను..
ABN , Publish Date - Oct 11 , 2025 | 12:28 PM
పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేసుకుని ఇంటిపట్టున గడుపుతున్నారని, ఆయన ప్రశాంతతకు భంగం కలిగించేలా ఆరోగ్యానికి హాని కలిగిస్తే చూస్తూ ఊరుకోనని ఆయన తనయుడు, పీఎంకే నేత డాక్టర్ అన్బుమణి రాందాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
- అన్బుమణి ఆగ్రహం
చెన్నై: పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్(Ramdas) ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేసుకుని ఇంటిపట్టున గడుపుతున్నారని, ఆయన ప్రశాంతతకు భంగం కలిగించేలా ఆరోగ్యానికి హాని కలిగిస్తే చూస్తూ ఊరుకోనని ఆయన తనయుడు, పీఎంకే నేత డాక్టర్ అన్బుమణి రాందాస్(Dr Anbumani Ramdas) ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉత్తాండిలో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ... తన తండ్రి రాందాస్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, సాధారణ వైద్యపరీక్షలు చేసుకోవడానికే అపోలో ఆస్పత్రికి వెళ్లి ఇంటికి తిరిగొచ్చారని చెప్పారు.
వాస్తవాలు ఇలా ఉండగా ఇంటిపట్టున ప్రశాంతంగా ఉన్న రాందాస్‌ను పరామర్శించేందుకు రండి అంటూ అనుచరులు ఎవరెవరికో ఫోన్ చేసి పిలుస్తున్నట్లు తనకు తెలిసిందని అన్నారు. అదే పనిగా వచ్చి చూడటానికి రాందాస్ ఏమైనా ఎగ్జిబిషనా?, ఆయన పరిస్థితిని సాకుగా పెట్టుకుని కొందరు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

‘నాన్న భద్రతకు భంగం వాటిల్లితే ఊరుకోను... ఆయనకు ఏవైనా జరిగినా ఊరుకోను... ఆయన అనారోగ్యంగా ఉన్నారంటూ వదంతులు పుట్టించినా ఊరుకోను’ అంటూ ఆ సభలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ తన తండ్రిపై ఉన్న ప్రేమాభిమానాలను ఎలుగెత్తి చాటుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
భద్రాద్రి రామయ్య సేవలో 225 జంటలు
Read Latest Telangana News and National News