Arjuna: కరూర్ మృతుల కుటుంబాలను దత్తత తీసుకుంటాం..
ABN , Publish Date - Oct 14 , 2025 | 10:12 AM
కరూర్‌లో టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచారపర్యటన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది కుటుంబాలను దత్తత తీసుకుంటామని ఆ పార్టీ ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జునా తెలిపారు.
- టీవీకే నేత ఆదవ్ అర్జున్
చెన్నై: కరూర్‌లో టీవీకే అధ్యక్షుడు విజయ్(Vijay) ప్రచారపర్యటన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది కుటుంబాలను దత్తత తీసుకుంటామని ఆ పార్టీ ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జునా(Adav Arjuna) తెలిపారు. సోమవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరూర్ దుర్ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు టీవీకే శ్రేణులకు ఊరట కలిగించేలా ఉందన్నారు.

కరూర్‌లో పోలీసులు నిర్దేశించిన స్థలంలోనే విజయ్ ప్రచార చేశారని, కరూర్ సరిహద్దులోనే పోలీసులు తమను స్వాగతించడం పలు అనుమానాలకు తావిచ్చేలా ఉందన్నారు. పోలీసులు నిర్దేశించిన మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 10 గంటల్లోగా విజయ్ ప్రచార ప్రాంతానికి వచ్చారని, ఆయన ఆలస్యంగా వచ్చారని చెప్పటం అసత్యమని ఆదవ్ అర్జునా పేర్కొన్నారు. తొక్కిసలాట జరిగిన వెంటనే తామంతా కరూర్ జిల్లా సరిహద్దులోనే నిలిచి ఉన్నామని,

ఆ సమయంలో మళ్ళీ తొక్కిసలాట జరుగుతున్న ప్రాంతానికి వెళితే అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని పోలీసు అధికారులు హెచ్చరించడం వల్లే అక్కడి నుండి బయలుదేరినట్లు తెలిపారు. కరూర్ దుర్ఘటన జరిగిన తర్వాత టీవీకే జిల్లా కార్యదర్శులను పోలీసులు తప్పుడు కేసుల్లో అరెస్టు చేయడం ఆనవాయితీగా మారిందన్నారు. కరూర్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది కుటుంబీకులకు తమ పార్టీ అండగా నిలుస్తుందని, ఆ కుటుంబాలను దత్తత తీసుకునేందుకు విజయ్ సిద్ధంగా ఉన్నారని కూడా ఆయన చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దేవుడా.. చుక్కలనంటుతున్న పసిడి ధరలు
వెంకటేష్ నాయుడి ఫోన్ అన్‌లాక్‌కు అనుమతి
Read Latest Telangana News and National News