Trains: ప్రయాణికులకు బిగ్ అలెర్ట్.. ఆ రైలు తిరుపతికి బదులు తిరుచానూరు నుంచి..
ABN , Publish Date - Oct 10 , 2025 | 12:41 PM
తిరుపతి నుంచి చెన్నై సెంట్రల్‌కు బయల్దేరే రైలు, తిరుపతికి బదులు తిరుచానూరు నుంచి బయల్దేరనుంది. ఈ మేరకు దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో... మరమ్మతు పనుల కారణంగా చెన్నై సెంట్రల్ నుంచి తిరుపతికి వెళ్లే అన్ రిజర్వ్‌డ్ రైళ్ల సేవలో మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపింది.
- చెన్నై సెంట్రల్-తిరుపతి అన్ రిజర్వ్‌డ్ రైలు సేవల్లో మార్పులు
చెన్నై: తిరుపతి నుంచి చెన్నై సెంట్రల్‌కు బయల్దేరే రైలు, తిరుపతి(Tirupati)కి బదులు తిరుచానూరు నుంచి బయల్దేరనుంది. ఈ మేరకు దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో... మరమ్మతు పనుల కారణంగా చెన్నై సెంట్రల్ నుంచి తిరుపతికి వెళ్లే అన్ రిజర్వ్‌డ్ రైళ్ల సేవలో మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపింది. ఆ ప్రకారం, అరక్కోణం తిరుపతి వెళ్లే రైలు శుక్రవారం నుంచి నవంబరు 5వ తేది వరకు తిరుపతికి బదులుగా తిరుచానూరు రైల్వేస్టేషన్ వరకు నడుపనున్నారు.

మరుమార్గంలో తిరుపతి నుంచి అరక్కోణం బయల్దేరే రైలు తిరుపతికి బదులుగా తిరుచానూరు నుంచి బయల్దేరుతుంది. అలాగే, తిరుపతి నుంచి చెన్నై సెంట్రల్ వెళ్లే రైలు తిరుపతికి బదులుగా తిరుచానూరు నుంచి, చెన్నై సెంట్రల్ నుంచి తిరుపతికి వచ్చే రైలు తిరుపతికి బదులు తిరుచానూరు వరకు మాత్రమే నడుస్తాయని దక్షిణ రైల్వే తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం కాన్వాయ్ అంబులెన్స్‌కు ఇన్సూరెన్స్ మరిచారు
భార్య డబ్బులు ఇవ్వలేదని చెరువులో దూకిన భర్త
Read Latest Telangana News and National News