Minister: ఉన్నత విద్యాశాఖపై గవర్నర్ ఒత్తిడి తెస్తున్నారు..
ABN , Publish Date - Oct 11 , 2025 | 01:50 PM
రాష్ట్రంలో ఉన్నత విద్యా శాఖపై గవర్నర్ ఒత్తిడి తెస్తున్నారని ఉన్నత విద్యాశాఖ మంత్రి కొవి చెళియన్ ఆరోపించారు. తిరుచ్చిలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ... విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అధికంగా ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొనడం అర్థ రహితమన్నారు.
- మంత్రి కొవి చెళియన్ ఆరోపణ
చెన్నై: రాష్ట్రంలో ఉన్నత విద్యా శాఖపై గవర్నర్ ఒత్తిడి తెస్తున్నారని ఉన్నత విద్యాశాఖ మంత్రి కొవి చెళియన్(Minister Kovi Cheliyan) ఆరోపించారు. తిరుచ్చిలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ... విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అధికంగా ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొనడం అర్థ రహితమన్నారు. డీఎంకే అధికారం చేపట్టిన తర్వాత 2,700కు పైగా గౌరవ ప్రొఫెసర్లు, 2,700కు పైగా శాశ్వత ప్రొఫెసర్లుగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. అందువల్ల ఖాళీలు అన్న మాటకు స్థానం లేదన్నారు.

విశ్వవిద్యాలయాలు ఆమోదించిన వేతనాలతో పాటు, ఆర్థిక వనరులు లేని కొన్ని కళాశాల ప్రొఫెసర్లకు వేతనాలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ ప్రాజెక్ట్‌లకు గవర్నర్ అనుమతులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. కుంభకోణంలో కలైంజర్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి నిరాకరిస్తున్నారన్నారు. అలాగే, అన్ని ప్రభుత్వ పథకాలు, బిల్లులను గవర్నర్ అడ్డుకోవడం తమిళనాడులో మాత్రమే జరుగుతోందని మంత్రి చెళియన్ విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
భద్రాద్రి రామయ్య సేవలో 225 జంటలు
Read Latest Telangana News and National News