Home » Central Govt
ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో కొత్త జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో మరో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేసేందుకు అవసరమైన బడ్జెట్ సహాయం అందించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఎంపీ లింగమనేని రమేశ్ కోరారు.
కేంద్ర ప్రభుత్వం రైల్వేల అభివృద్ధిలో తెలంగాణకు పెద్దపీట వేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఏడాదికి సగటున రూ. 5,454 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. పదేళ్లతో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, స్టేషన్ల అభివృద్ధితో పాటు 100 కొత్త రైళ్లను ప్రవేశపెట్టిందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలోని రైల్వేల అభివృద్ధికి అంకితభావంతో తాము పనిచేస్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కొత్త రైల్వే ట్రాక్‌లు, వాటిని ఉన్నతీకరణ చేసే విధంగా పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డికి కేవలం తమ ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప.. ఆయనకు పని ఏమీ లేదని విమర్శించారు.
వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో పనిముట్లు ఖరారు చేశామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. యాంత్రీకరణ సబ్సిడీ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని పేర్కొన్నారు.
నేపాల్‌లో పలు ప్రాంతాల్లో వచ్చిన వరదల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు గల్లంతయ్యారు. వారిలో.. పార్వతీపురానికి చెందిన ఎన్ఆర్ఐ కుటుంబం గల్లంతైంది. అలాగే, కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరుకు చెందిన చొప్పరపు రమేశ్ కూడా గల్లంతయ్యారు. వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదాలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర జలసంఘం (CWC) ఛైర్మన్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
గత కొంతకాలంగా పంచదార ధరలు పెరుగుతున్నాయి. నెల రోజుల్లో ధర 40 నుంచి 50 శాతం పెరిగింది. ఈ పరిస్థితికి కారణం ఏంటి? చెరుకు పంటను ఇథనాల్ ఉత్పత్తికోసం ఉపయోగిస్తుండటం వల్లే ధరలు పెరిగాయా?
ఫుకెట్ - ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఈ ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు జరుపుతోందని పేర్కొన్నారు.
నషా ముక్త్ సమాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా వ్యాఖ్యానించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి, విద్యా క్రీడా రంగాల్లో రాణించాలని సూచించారు.