Home » Central Govt
కేంద్ర అఖిలపక్ష సమావేశం, పార్లమెంట్ సమావేశాలపై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ స్పందించారు. పహల్‌గామ్ ఉగ్రదాడి, ట్రంప్ ప్రకటనలు, ఆపరేషన్ సిందూర్, చైనా పాత్రతో సహా వివిధ అంశాలపై పార్లమెంట్ లో 2 నుంచి 3 రోజుల పాటు చర్చ జరగాలని సూచించారు. బీహార్‌లో ఓట్ల రద్దు, పహల్‌గామ్ ఉగ్రదాడి, జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా అంశాలను పార్లమెంట్‌లో తాము లేవనెత్తుతామని చెప్పుకొచ్చారు.
Digital India Reel: ‘పదేళ్ల డిజిటల్ ప్రోగ్రెస్.. విశృంఖల అవకాశాలు’ అన్న శీర్షికతో పోటీ జరుగుతోంది. డిజిటల్ సర్వీసుల కారణంగా మీ జీవితం ఎలా మారింది. అది కూడా పాజిటివ్‌గా ఎలా మారిందన్న దానిపై ఓ వీడియో చేయాలి.
విద్యుత్ సంస్కరణలు దేశంలో తొలిసారి ప్రారంభించింది తానేనని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. సంస్కరణల అమలు తర్వాత తాను అప్పట్లో అధికారం కోల్పోయానని చెప్పుకొచ్చారు. తక్కువ ఖర్చుతో హరిత విద్యుత్ తయారీ, స్టోరేజ్‌పై దృష్టి సారించామని పేర్కొన్నారు.
అశోక్‌గజపతిరాజు గవర్నర్ అయినందుకు సంతోషం.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని తెలిసి బాధ.. ఒకేసారి ఆయన అభిమానులకు కలిగిన భావోద్వేగాలివి. అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసి టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. తాను ఏస్థాయిలో ఉన్నా.. ఎలాంటి అత్యున్నత పదవులు చేపట్టినా విజయనగరం గడ్డను మరువనంటూ ఆయన చేసిన ప్రకటనపై జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రేవంత్ ప్రభుత్వం చేసే అన్యాయాన్ని బీసీ సంఘాలు ఎందుకు ప్రశ్నించడం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. బీసీల్లో ముస్లింలను కలపడం ఏంటని నిలదీశారు. బీసీలకు మీరిచ్చేది కేవలం ఐదు శాతమేనని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి ఏఏఐబీ ప్రాథమిక నివేదిక వచ్చిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రాథమిక నివేదిక ద్వారా ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించలేమని తెలిపారు. ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత వివరాలను వెల్లడిస్తామని అన్నారు.
అంతర్జాతీయంగా భారతదేశం ఇమేజ్ పెంచే పనిలో ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఎక్కడికి వెళ్లినా మోదీకి అపూర్వ స్పందన లభిస్తోంది.
Andhrapradesh Census: 2027లో దేశవ్యాప్తంగా జనగణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. జనగణన కోసం ఈ ఏడాది జూన్ 16న కేంద్ర హోం శాఖ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది.
మైనింగ్ ప్రాంతాల అభివృద్ధిలో కీలక పాత్ర కలెక్టర్లదేనని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఉద్ఘాటించారు. డిస్టిక్ మినరల్ ఫౌండేషన్ స్థాపించి పదేళ్లు అయ్యిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. విజయనగరం జిల్లా గరివిడిలోని వెటర్నరీ కాలేజ్‌పై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.