Home » Central Govt
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి అనేక పథకాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, పీఎం కిసాన్ నుండి ఫసల్ బీమా వరకు.. కేంద్రం తెచ్చిన కొన్ని సూపర్ స్కీమ్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కేరళ నర్సు నిమిష ప్రియ (Nimisha Priya) కేసు క్షణానికో మలుపు తిరుగుతోంది. యెమెన్ (Yemen) ప్రభుత్వం నిమిష ఉరిశిక్ష రద్దుకు అంగీకరించిందని వార్తలు చక్కర్లు కొడుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం అవాస్తవమంటూ తోసిపుచ్చింది.
సీఎం చంద్రబాబు పర్యవేక్షణతో విజయవాడలో ఇటీవలే స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు దక్కించుకుందని మంత్రి నారాయణ తెలిపారు. సీఎం చంద్రబాబు కృషితో రాష్ట్రానికి అమృత్ పథకం ద్వారా కేంద్రం నిధులు కేటాయించిందని గుర్తుచేశారు. అమృత్ పథకం ద్వారా ఏపీవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో వచ్చే మూడేళ్లలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ఎరువుల గురించి తమ ప్రభుత్వంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎరువులు వచ్చిన స్టాక్ ఎంత.. సరఫరా ఎంత రావాల్సిందో ముందు తెలుసుకోవాలని సూచించారు. రామచంద్రరావు వెంటనే ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే ప్రయత్నం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు
పసుపు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్‌రెడ్డి ఒక్క ఉత్తరం కూడా ఎందుకు రాయలేదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఈ విషయంపై కాంగ్రెస్ నేతలను నిలదీయాలని రైతులకు పిలుపునిచ్చారు. నకిలీ విత్తనాలు అమ్ముతుంటే స్థానిక మంత్రి ఏం చేస్తున్నారని నిలదీశారు.
కొత్తగా ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించేందుకు కేంద్రం నూతన పథకాన్ని ఆవిష్కరించింది... .
అశ్లీలమైన, అభ్యంతరకరమైన కంటెంట్‌ను అందించే OTT ప్లాట్‌ఫారమ్‌లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అలాంటి 25 వెబ్‌సైట్‌లు, యాప్‌లను బ్లాక్ చేసింది.
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేసినట్లు ప్రకటించిన విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు గుర్తుచేశారు.
తెలంగాణ కులగణన, రిజర్వేషన్లు దేశానికి దశ దిశ చూపుతాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. బీసీ సర్వే మొదలు పెట్టినప్పుడు కొంతమంది అవసరం లేదన్నారని తెలిపారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కులగణన సర్వే నిదర్శనంగా నిలిచిందని నొక్కిచెప్పారు.
ఆంధ్రా తోటపురి మామిడి రైతులకు పెద్ద ఉపశమనం లభించింది. 2025–26 సంవత్సరానికి MIS కింద ధరల లోపం చెల్లింపు (PDP)ను కేంద్రం ఆమోదించించింది. కేంద్రం నిర్ణయంతో ఏపీలో 1.62 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి కొనుగోలుకు అవకాశం లభించినట్లైంది. మామిడి రైతులకు క్వింటాల్‌కు రూ.1,490.73లు చెల్లించనున్నారు.