Home » Central Govt
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను రేపు సిట్ అధికారులు విచారించనున్నారు. అనంతరం ఆయన వాంగ్మూలాన్ని సిట్ రికార్టు చేయనుంది. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ విచారణపై ఇవాళ(గురువారం) కేంద్ర హోం శాఖ అధికారులు ఆయనతో భేటీ అయ్యారు.
రాష్ట్రపతిపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ వెంటనే క్షమాపణలు చెప్పాల నిడిమాండ్ చేశారు. రాజకీయాలకు సంబంధం లేని రాష్ట్రపతి గురించి మాట్లాడడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
రష్యా చమురు దిగుమతిని కొనసాగించడానికి ప్రతిస్పందనగా అదనపు సుంకాలను విధించాలనే అమెరికా నిర్ణయాన్ని భారతదేశం తీవ్రంగా ఖండించింది. ఈ చర్య అన్యాయం, అసమంజసమైనదని అభివర్ణించింది.
బీసీ రిజర్వేషన్లు 42 శాతం కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని కాంగ్రెస్ నేతలు బుధవారం జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు డీఎంకే ఎంపీ కనిమొళి మద్దతు తెలిపారు. రిజర్వేషన్ల పరిమితిని తక్షణమే సవరించాలని కనిమొళి డిమాండ్ చేశారు.
కాళేశ్వరానికి అనుమతులు ఇచ్చిందే కేంద్రప్రభుత్వమని మాజీమంత్రి హరీష్‌రావు గుర్తుచేశారు. కాళేశ్వరం పూర్తి రిపోర్ట్ బయటకు వచ్చాక కాంగ్రెస్ సంగతి చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే సీఎం రేవంత్‌రెడ్డి హడావుడి చేస్తున్నారని హరీష్‌రావు విమర్శించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కీలక ప్రకటన చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదని స్పష్టం చేసింది. ప్రైవేటీకరణ ప్రక్రియపై కేంద్రం వెనక్కు తగ్గింది.
బెట్టింగ్ యాప్‌లను నిషేధించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. బెట్టింగ్ యాప్‌ల నిషేధంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్, కౌంటింగ్ ఉండనున్నట్లు తెలిపింది.
ప్రజా సమస్యల పరిష్కారమే దిశగా రేవంత్ ప్రభుత్వంపై పోరాడాలని గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. గులాబీ నేతలతో ఎర్రవల్లి ఫాంహౌస్‌లో మంగళవారం కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ మేరకు కేసీఆర్ ప్రకటన విడుదల చేశారు.
బీసీ రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందించింది. తెలంగాణ భవన్‌లో మంగళవారం బీఆర్ఎస్ బీసీ నాయకుల సమావేశం జరిగింది. కాంగ్రెస్‌కు పోటీగా ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలవాలని బీఆర్ఎస్ హై కమాండ్ నిర్ణయం తీసుకుంది.