Home » Businesss
వరుసగా ఐదు ట్రేడింగ్ సెషన్ల పాటు నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం బలంగా పుంజుకున్నాయి. కొనుగోళ్లు ఊపందుకోవడంతో ప్రధాన సూచీలన్నీ లాభాల్లో ముగిశాయి.
దేశంలో డిజిటల్ చెల్లింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. రూ.2 వేలకుపైగా జరిగే యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్‌ను అమలుచేసే దిశగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
భారతదేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అదనంగా 12.5 శాతం సుంకాన్ని విధించాలనే అమెరికా ప్రతిపాదనను పునఃసమీక్షించాలని భారత్ అధికారికంగా డిమాండ్ చేసింది.
పశ్చిమాసియాలో మళ్లీ రాజుకున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దేశీయ స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. ఈ ఉదయం నుంచి ఒడిదుడుకులతో సాగిన మార్కెట్లు, మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి గురై భారీగా కుప్పకూలాయి.
దేశంలో ఫోన్ రీచార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచేందుకు టెలికం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. రానున్న 3-4 నెలల్లో మొబైల్ టారిఫ్‌లు 12-15 శాతం పెరిగే అవకాశముందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ సెంట్రమ్ ఇన్‌స్టిట్యూషనల్ రీసెర్చ్ వెల్లడించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తత తగ్గిన నేపథ్యంలో ముడి చమురు ఉత్పత్తి పెంచాలని ఒపెక్ ప్లస్ (OPEC+) కూటమికి చెందిన 7 దేశాలు నిర్ణయం తీసుకున్నాయి.
జీఎస్‌టీ వసూళ్లలో రెండు తెలుగు రాష్ట్రాలు దూసుకుపోతున్నాయి. దేశవ్యాప్తంగా జూన్ నెలకు సంబంధించిన స్థూల, నికర జీఎస్‌టీ వసూళ్ల వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
భవిష్యత్తులో బంగారం ధరలు పడిపోతాయనే భయంతో, తమ వద్ద ఉన్న పాత బంగారు ఆభరణాలను అమ్మి నగదుగా మార్చుకునేందుకు దేశంలోని మధ్యతరగతి కుటుంబాలు ఎగబడుతున్నారు. ఇలా.. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఏకంగా 50 టన్నుల పాత బంగారాన్ని అమ్మేశారు.
దేశంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రిజర్వ్ బ్యాంక్ కీలక ముందడుగు వేసింది. ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్ల వడ్డీ రేట్ల పరిమితులను తాత్కాలికంగా ఎత్తివేస్తూ బ్యాంకులకు మరింత స్వేచ్ఛ కల్పించింది.
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం ప్రపంచ ఆర్థిక రంగానికి సరికొత్త జవసత్వాలను అందించింది. హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 2 నెలల కనిష్టానికి పడిపోవడంతో భారతీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ సరికొత్త రికార్డుల వైపు దూసుకెళ్లాయి.