బంగారం, వెండి ఆభరణాలు పింక్ పేపర్‌లోనే ఎందుకు ఇస్తారో తెలుసా?
ABN , Publish Date - Jan 27 , 2026 | 03:40 PM
బంగారం, వెండి ఆభరణాలను దుకాణదారులు పింక్ పేపర్‌లోనే చుట్టి ఇస్తారు. అయితే ఆభరణాలను ఈ కలర్ పేపర్‌లోనే ఎందుకు ఇస్తారు? దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: పెళ్లిళ్లు, పండుగలు వంటి ముఖ్యమైన సందర్భాల్లో తప్పనిసరిగా బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. ఆభరణాలను కొన్నప్పుడు, దుకాణదారులు వాటిని పింక్ కలర్ కాగితంలో చుట్టి ఇస్తారు. అయితే ఆభరణాలను ఇలా పింక్ కలర్ పేపర్‌లోనే ఎందుకు ఇస్తారు? దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలు ఏంటో ఓసారి చూద్దాం...
పింక్ పేపర్‌లోనే ఎందుకు?
బంగారం, వెండి ఆభరణాలను పింక్ కలర్ కాగితంలో చుట్టడం వెనుక ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి. బంగారం, వెండి చాలా సున్నితమైన లోహాలు.. గులాబీ రంగు కాగితం, దాని మెత్తదనం వల్ల ఆభరణాలకు గీతలు పడకుండా, దెబ్బతినకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఆ కాగితంపై ఉండే మెటాలిక్ మెరుపు వల్ల ఆభరణాలు మరింత ప్రకాశవంతంగా, అందంగా కనిపిస్తాయి. ఇది కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి సాయపడుతుంది.

హిందూ సంప్రదాయాల ప్రకారం.. పింక్ లేదా గులాబీ రంగు ఆనందం, ప్రేమ, శుభఫలితాలకు సంకేతం. ముఖ్యంగా ఈ రంగు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమని నమ్మకం. పాతకాలం నుంచి బంగారం లక్ష్మీదేవికి సంబంధించిన లోహంగా భావిస్తారు. గులాబీ, ఎరుపు వంటి రంగులు శుభప్రదమైనవిగా, సానుకూల శక్తికి ప్రతీకలుగా చూస్తారు. అలా గులాబీ రంగులోని బంగారం శుభం తీసుకొస్తుందని చాలా మంది నమ్మకం. అందుకే బంగారాన్ని పింక్ పేపర్‌లో చుట్టి ఇవ్వడం వల్ల సంపద పెరుగుతుందని విశ్వసిస్తారు.

వెంటనే పారేయకూడదు..
దుకాణం నుంచి తీసుకొచ్చిన బంగారం లేదా వెండితో పాటు వచ్చిన పింక్ పేపర్‌ను వెంటనే పారేయకూడదని పెద్దలు చెబుతారు. దాన్ని బీరువా లేదా లాకర్‌లో ధనం నిల్వ చేసే చోట భద్రంగా ఉంచితే మంచిదని నమ్మకం. ఇలా చేయడం వల్ల డబ్బు నిలకడగా ఉండటం సహా ఆభరణాల విలువ కూడా పెరుగుతుందంటారు.

సంప్రదాయం మాత్రమే కాదు..
బంగారం, వెండిని పింక్ పేపర్‌లో ఇవ్వడం అనేది కేవలం పాత ఆచారం కాదు. అది మన శ్రేయస్సు, సిరిసంపదలు పెరగాలని కోరుకునే ఒక చిన్న ఆధ్యాత్మిక విశ్వాసం. ఈ కారణాల వల్ల బంగారం, వెండి కొనేటప్పుడు గులాబీ రంగు కాగితం వాడకం సర్వసాధారణమైంది.
NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.
Also Read:
బీట్‌రూట్ హల్వా.. ఈ స్వీట్ ఎలా తయారు చేయాలో మీకు తెలుసా?
ఒంటరిగా ప్రయాణించాలనుకుంటున్నారా? ఈ 5 ప్రదేశాలు బెస్ట్!
జీవితంలో సంతోషంగా ఉండాలంటే.. ఈ సులభమైన సూత్రాలు పాటించండి
For More Latest News