BSNL Offer: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్..
ABN , Publish Date - Jan 06 , 2026 | 09:24 PM
బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు అదిరిపోయే బంపర్ ఆఫర్ ప్రకటించింది. పండుగ సీజన్ సందర్భంగా ప్రారంభించిన 3GB రోజువారీ డేటా ప్రమోషనల్ ఆఫర్ ని ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం దిగ్గజం.. రూ.225 ప్లాన్‌పై డేటా ప్రయోజనాలు పెంచింది. ఈ స్పెషల్ ఆఫర్ జనవరి 31 వరకు అధికారికంగా పొడిగించింది. ఈ పొడిగింపు కింద.. బీఎస్ఎన్ఎల్ హై డేటా ప్లాన్‌పై 3GB రోజువారి డేటాను అందిస్తోంది. ఇది సాధారణంగా రోజుకు 2.5GB అందిస్తుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ‘X’ లో ప్రకటించింది. బేస్ ప్లాన్ కోసం పొడిగింపు ధ్రువీకరించినప్పటికీ, ఇతర మూడు ప్రమోషనల్ ప్లాన్స్‌కు అదనపు డేటా ప్రయోజనాలు కొనసాగుతాయా? అనే విషయంపై కంపెనీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
పండుగ ఆఫర్ కింద మొదట్లో బీఎస్ఎన్ఎల్ నాలుగు నిర్దిష్ట రీఛార్జ్ ప్లాన్లపై 0.5GB అదనపు రోజువారీ డేటాను అందించే ‘హాలిడే బొనాంజా’ను అనౌన్స్ చేసింది. వాస్తవానికి ఈ ఆఫర్ జనవరి 4న ముగియాల్సి ఉంది. STV 225, STV 347, STV 485, PV 2399 ఈ ప్రీమియిడ్ ఓచర్లలో ప్రతి ఒక్కటి అపరిమిత కాలింగ్, ఉచిత జాతీయ రోమింగ్ రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లను కలిగి ఉంటాయి. జనవరి 31 ముందు రూ.225 ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు ప్రతిరోజూ 3GB హై స్పీడ్ డేటాను పొందుతారు. ఇందులో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100 రోజువారీ ఎస్ఎంఎస్‌లు ఉన్నాయి. ఈ ఆఫర్ ఉన్నప్పటికీ.. రూ.225 వోచర్‌ను హైలెట్ చేసినందుకు, సబ్‌స్క్రైబర్‌లు వారి నిర్దిష్ట డేటా బోనస్‌లపై బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్‌ను సెర్చ్ చేయాలని సూచిస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఉత్తరప్రదేశ్‌లో 2.89 కోట్ల మంది ఓటర్ల తొలగింపు
తొక్కిసలాట మరణాలపై విజయ్‌కు సీబీఐ సమన్లు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి