Daily SIP: రోజూ రూ.10 తో డైలీ సిప్ పెట్టుబడులు పెట్టే అవకాశం
ABN , Publish Date - Dec 29 , 2025 | 12:46 PM
రోజువారీ SIPతో పెట్టుబడులు ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. కేవలం రోజూ రూ. 10 చెల్లించి సిప్ పెట్టుబడులు పెట్టొచ్చు. భారత్‌లో పెట్టుబడి సంస్కృతిని పెంచేందుకు ఈ వెల్త్ ప్లాట్‌ఫాం కొత్త అధ్యాయం..
ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 29: భారత్‌లో పెట్టుబడి సంస్కృతిని పెంచేందుకు ఫోన్‌పే వెల్త్ ప్లాట్‌ఫాం కొత్త అధ్యాయం ప్రారంభించింది. రోజుకు కేవలం రూ. 10 నుంచి మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే 'డైలీ SIP' (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ఫీచర్‌ను పరిచయం చేసింది.
ఈ ఫీచర్ ద్వారా సామాన్యులు కూడా సులభంగా దీర్ఘకాలిక ధన సృష్టికి బాటలు వేసుకోవచ్చు. ఫోన్‌పే యాప్‌లో UPI ఆటోపే ద్వారా ఆటోమాటిక్‌గా రోజువారీ పెట్టుబడులు చేయవచ్చు. ఈక్విటీ, గోల్డ్, మల్టీ-ఆసెట్ వంటి వివిధ ఫండ్లలో రిస్క్ స్థాయి ఆధారంగా ఎంచుకోవచ్చు. ఎప్పుడైనా మొత్తాన్ని పెంచడం, తగ్గించడం, పాజ్ చేయడం లేదా ఆపడం కూడా సాధ్యమే.
భారత మ్యూచువల్ ఫండ్ రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. అక్టోబర్ 2025లో నెలవారీ SIPలు రూ. 29,000 కోట్లు దాటాయి (AMFI డేటా). గత 5 ఏళ్లలో 30% వార్షిక వృద్ధి చెంది.. ఇప్పడు 9.45 కోట్ల SIP అకౌంట్లు ఉన్నాయి. రూపీ కాస్ట్ యావరేజింగ్ ద్వారా మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి రక్షణ లభిస్తుందని ఫోన్‌పే వెల్త్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రొడక్ట్స్ హెడ్ నీలేష్ డి. నాయక్ తెలిపారు. ఫోన్‌పే వెల్త్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (SEBI రిజిస్టర్డ్) ద్వారా స్టాక్స్, మ్యూచువల్ ఫండ్లు, వెల్త్ బాస్కెట్లు అందిస్తోంది.
గమనిక: పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. మీ ఆర్థిక నిఫుణుడిని సలహా పాటించి ముందుకెళ్లడం మంచిది.
ఇవీ చదవండి:
సూపర్.. ప్రపంచంలో నెం.3 స్థానానికి చేరిన వెండి! ఏకంగా..
వామ్మో.. భగ్గుమన్న బంగారం, వెండి ధరలు