Bank Holidays: జనవరి 1న బ్యాంకులకు హాలిడేనా? వివరాలివే..
ABN , Publish Date - Dec 31 , 2025 | 04:55 PM
మరికొన్ని గంటల్లో యావత్ ప్రపంచం కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకబోతోంది. ప్రజలంతా న్యూఇయర్ వేడుకల కోసం ఎప్పటి నుంచో ప్లాన్స్ వేసుకుని ఉంటారు. ఇవాళ రాత్రి అంతా న్యూఇయర్ సెలబ్రేషన్స్‌లో ఎంజాయ్ చేస్తుంటారు. కొత్త సంవత్సరం తొలి రోజున కొందరు పర్యటనలకు వెళితే..
ముంబై, డిసెంబర్ 31: మరికొన్ని గంటల్లో యావత్ ప్రపంచం కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకబోతోంది. ప్రజలంతా న్యూఇయర్ వేడుకల కోసం ఎప్పటి నుంచో ప్లాన్స్ వేసుకుని ఉంటారు. ఇవాళ రాత్రి అంతా న్యూఇయర్ సెలబ్రేషన్స్‌లో ఎంజాయ్ చేస్తుంటారు. కొత్త సంవత్సరం తొలి రోజున కొందరు పర్యటనలకు వెళితే.. మరికొందరు దేవాలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుంటారు. కొత్త సంవత్సరం తొలి రోజు మంచి జ్ఞాపకంగా ఉండిపోయేలా ప్లాన్స్ వేసుకుంటారు. అందుకే.. ఆయా సంస్థలు సైతం తమ ఎంప్లాయిస్‌కి సెలవులు ప్రకటిస్తాయి. సెలవులు లేని సంస్థలో ఉద్యోగులైతే ముందుగానే డిసెంబర్ 31, జనవరి 1వ తేదీన లీవ్స్ పెట్టేసుకుంటారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం బ్యాంకులకు సెలవులు ప్రకటించింది. జనవరి నెలకు సంబంధించి సెలవుల జాబితాను ఆర్బీఐ విడుదల చేసింది. దీని ప్రకారం దేశ వ్యాప్తంగా ఏయే రాష్ట్రంలో బ్యాంకులు క్లోజ్ అవుతాయి.. ఏ రాష్ట్రంలో నడుస్తాయనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..
డిసెంబర్ 31న సెలవు..
డిసెంబర్ 31, 2025న నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలలో బ్యాంకులకు సెలవులు ప్రకటించారు. ఇతర రాష్ట్రాల్లో బ్యాంకుల కార్యకలాపాలు యధావిధిగా నడుస్తాయి.
జనవరి 1వ తేదీన బ్యాంకులకు సెలవులు..
మిజోరం, తమిళనాడు, సిక్కిం, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్‌లలో బ్యాంకులు 2026 జనవరి 1న నూతన సంవత్సరం తొలిరోజు, గాన్-నగై కారణంగా సెలవు ఉంది. ఇతర నగరాల్లో, బ్యాంకుల కార్యకలాపాలు యథావిధిగా సాగుతాయి.
జనవరి 2026లో బ్యాంకులకు సెలవులు..
ఆయా రాష్ట్రాల్లో స్థానిక సెలవులు, జనవరి 2026 లో వారాంతపు సెలవులు సహా దేశ వ్యాప్తంగా బ్యాంకులకు మొత్తం 15 రోజులు హాలిడేస్ ఉన్నాయి. అయితే, మొబైల్, ఇంటర్నెట్‌లో బ్యాంకింగ్ కార్యకలాపాలు ఎలాంటి అంతరాయం లేకుండా ఉంటాయి.
RBI లిస్ట్ ప్రకారం జనవరి 2026లో బ్యాంకులకు 15 రోజులు సెలవులు ఉండనున్నాయి. అవి..
కొత్త సంవత్సరం/గాన్-నగై : జనవరి 1
నూతన సంవత్సర వేడుక/మన్నం జయంతి : జనవరి 2
స్వామి వివేకానంద జయంతి : జనవరి 12
మకర సంక్రాంతి/మాఘ్ బిహూ : జనవరి 14
సంక్రాంతి : జనవరి 15
తిరువళ్లువర్ దినోత్సవం : జనవరి 16
ఉజ్హవర్ తిరునాల్ : జనవరి 17
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి/సరస్వతి పూజ (శ్రీ పంచమి)/వీర్ సురేంద్రసాయి జయంతి/వసంత పంచమి : జనవరి 23
గణతంత్ర దినోత్సవం : జనవరి 26
ఇంకా, వారాంతాల్లో బ్యాంకులు సెలవులు ఉండే రోజులు ఇవే..
ఆదివారం: జనవరి 4
రెండవ శనివారం: జనవరి 10
ఆదివారం: జనవరి 11
ఆదివారం: జనవరి 18
నాల్గవ శనివారం: జనవరి 24
ఆదివారం: జనవరి 25
గమనిక: బ్యాంకుల సెలవులు వివిధ రాష్ట్రాల్లో మారుతూ ఉంటాయి. నేషనల్ పబ్లిక్ హాలిడేస్‌తో పాటు.. స్థానిక పండుగుల, ప్రత్యేక రోజుల దృష్ట్యా ఆయా ప్రాంతాల్లో బ్యాంకులకు హాలిడేస్ ఉంటాయి. ఉదాహరణగా చూసుకుంటే.. తెలంగాణ దినోత్సవం రోజున రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు ప్రకటిస్తే.. మిగతా రాష్ట్రాల్లో బ్యాంకులు ఓపెన్‌గానే ఉంటాయన్నమాట. మిగతా రాష్ట్రాల్లోనూ ఇదే విధంగా బ్యాంకులకు సెలవులు ప్రకటించే అవకాశం ఉంటుంది.
Also Read:
India Surpasses Japan: జపాన్‌ను దాటేసిన భారత్.. నాల్గవ అతి పెద్ద దేశంగా..
Young Players: యువ సంచలనాలు.. ప్రపంచానికి పరిచయం చేసిన 2025
BJP: దుర్యోధనుడు, దుశ్శాసనుడు కూడా మీరే.. మమతపై బీజేపీ ఫైర్